ఆర్ఆర్ఆర్ సినిమా టీం నుంచి స్పెషల్ అప్డేట్.. రిలీజ్ డేట్..!

Divya
RRR రణం రౌద్రం రుదిరం.. అనే పేర్లతో..RRR అనే సినిమాను నిర్మించడం జరిగింది రాజమౌళి. ఇక ఈ సినిమా ఒక పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ మూవీలో రామ్ చరణ్, ఎన్టీఆర్.. స్వాతంత్ర సమరయోధుల పాత్రలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాలో హీరోయిన్లుగా నటి ఒలివియా మోరిస్ , ఆలియా భట్ నటిస్తున్నారు. ఇప్పుడే సినిమా నుంచి ఒక అప్డేట్ వచ్చింది.. అది ఏదో చూద్దాం.

ఈ సినిమాని దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని గతంలో ప్రకటించినప్పటికీ.. కొన్ని కారణాల చేత ఈ సినిమా వాయిదా పడడం జరిగింది. ఇక ఈ రోజున ఈ సినిమా విడుదల తేదీపై ఒక అప్డేట్ రానున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం తెలుస్తున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 31 న విడుదల కానున్నట్లు సమాచారం తెలుస్తోంది.
కానీ ఈ సినిమాని అధికారికంగా..RRR టీం సభ్యుల నుంచి ఈ రోజున అధికారికంగా ఈ ప్రకటన రానున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో చివరి షెడ్యూల్ కోసం ఈ టీమ్ మొత్తం ఉక్రెయిన్ కు వెళ్లి వచ్చింది. ఇక ఈ మూవీ నుంచి విడుదలైన ఫ్రెండ్షిప్ డే సందర్భంగా.. దోస్తీ పేరుతో పాట విడుదల కాగా.. ఇది యూట్యూబ్లో సంచనలం గా మారుతోంది. ఇక ఈ సినిమా బిజినెస్ విషయానికి వస్తే.

నార్త్ ఇండియన్ థియేట్రికల్ రైట్స్, శాటిలైట్ రైట్స్ ను.. బాలీవుడ్ లో బడా నిర్మాణ సంస్థ అయినటువంటి.."పెన్ ఇండియన్"అనే ఒక ప్రైవేట్ నిర్మాణ సంస్థ అత్యధిక పారితోషికంతో దక్కించుకున్నట్లు సమాచారం. ఇక అంతే కాకుండా ఎలక్ట్రానిక్ సాటిలైట్, డిజిటల్ శాటిలైట్ హక్కులను కూడా ఈ సంస్థ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాకి సంగీతం..M.M. కీరవాణి అందిస్తున్నారు. ఇక ఈ సినిమాని తెలుగు తో పాటు తమిళ, హిందీ, మలయాళం, కన్నడ వంటి ఇతర భాషలలో కూడా ఒకేసారి విడుదల చేయనున్నట్లు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: