రిపబ్లిక్ టాక్ : సుప్రీమ్ హీరో సినిమాలో ఎవరు సుప్రీమ్ ?
రిపబ్లిక్ సినిమా ఇప్పుడు అందరి చర్చల్లో ఓ కామన్ పాయింట్ .. సినిమాలో సుప్రీమ్ ఎవరు? అన్నది కూడా డిస్కషన్ మేటర్ ...మెగా అల్లుడు సినిమాల విషయమై గతంలో లేనంత ఇమేజ్ ఈ సినిమాకు ఎందుకు ?
సుప్రీమ్ హీరో అని తేజూకు పేరు. ఒకప్పుడు ఈ పేరు మెగాస్టార్ ది. కాల క్రమంలో చిరంజీవి కాస్త మెగాస్టార్ అయ్యి, ఇండస్ట్రీని శా సించే స్థాయికి ఎదిగారు. అదే క్రమంలో సాయి తేజ్ రాణించాలని, మామయ్య పేరు నిలబెట్టాలని కోరుకుంటూ అభిమానులే ఆయ నకు సుప్రీమ్ హీరో అని బిరుదు ఇచ్చారు. ఇక ఆయన తాజా సినిమా రిపబ్లిక్ లో ఎవరు సుప్రీమ్?
ఇంకా చెప్పాలంటే..
అనేక ఒడిదొడుకులు దాటి, ఉత్కంఠతలను దాటి రిపబ్లిక్ సినిమా ఇవాళ విడుదలైంది. థియేటర్ల దగ్గర మెగాభిమానుల సందడి నెలకొంది. ఈ సినిమాతో సాయి ధరమ్ తేజ్ మరో స్థాయికి చేరుకున్నాడని మెగాభిమానులు పొంగిపోతున్నారు. ఆస్పత్రిలో ఉన్న సాయి ధరమ్ తేజ్ త్వరలోనే కోలుకుని, సక్సెస్ మీట్ కు రావాలని ప్రార్థిస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ఈ సిని మాపై ఇప్పటికే అనేక అంచనాలు ఉన్నాయి. వా టిని మరింత పెంచుకుంటూ పోతూ పవన్ చెప్పిన మాటలు అదనపు ఆకర్షణగా నిలిచాయి. తన కన్నా ధైర్యంగా, చెప్పాలను కున్న పాయింట్ ను నిజాయితీగా చెప్పిన డైరెక్టర్ దేవా కట్టాను ప్రీ రిలీజ్ వేడుకల్లో ప్రశంసించారు. అదేవిధంగా ఇప్పుడీ సినిమా థియేటర్లలో సందడి చేస్తుండడంతో సుప్రీమ్ ఎవరు తేజూ సినిమాలో అన్న చర్చ ఒకటి నడుస్తోంది.
ఎవరు ఔనన్నా కాదన్నా కథే సుప్రీమ్..డైరెక్టర్ ఎంచుకున్న ప్లాట్ పాయింట్ సుప్రీమ్..ఆ తరువాతే రమ్యకృష్ణ అయినా సాయి తేజ్ అయినా, దేవాకట్టా అయినా, మణి శర్మ అయినా..! అవును! ఏ సినిమాకు అయినా కథే సుప్రీమ్ .. ఈ సినిమా అదే విషయం మరోమారు నిరూపించిందన్న టాక్ వినిపిస్తోంది. తేజూ అభిమానుల సంబరాలకు కారణం ఇదే!