టాలీవుడ్ గతిని మార్చే సినిమాగా లవ్ స్టోరీ అవుతుందా!!

P.Nishanth Kumar
కరోన వచ్చిన తర్వాత టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ పరిస్థితి అత్యంత దారుణంగా అగమ్యగోచరంగా తయారైంది. ఎప్పుడు సినిమా థియేటర్లు మూత పడతాయో ఎప్పుడు సినిమా షూటింగ్ లు వాయిదా పడతాయో తెలియక అయోమయంగా సినిమాలను తెరకెక్కిస్తున్నారు చిత్ర నిర్మాతలు. ఓవైపు వడ్డీ రుణాల భారం మరోవైపు కరోనా టెన్షన్ ఇంకోవైపు సినిమా చిత్రీకరణ భయం ఉండగా నిర్మాతలకు కొత్త కష్టం ప్రేక్షకుల నుంచి వచ్చింది. దేశంలో ఎలాంటి సమస్య వచ్చినా ప్రభుత్వాలు సినిమా థియేటర్లను ముందుగా మూసివేయడం అన్నిటికంటే ఆఖరిగా సినిమా ధియేటర్ లను ఓపెన్ చేయడం వంటివి చేస్తున్నారు.

కరోనా సమయంలోనూ ఇలానే చేయగా కరోనా మహమ్మారి థియేటర్లలోనే ఉంటుందన్న భయంతో ప్రేక్షకులు థియేటర్లకు రావడం మానేశారు. ఇప్పుడు గతంలోలా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం కోసం నా నా తిప్పలు పడుతుంది సినిమా ఇండస్ట్రీ. ఈ నేపథ్యంలో మొదటి దశ తరువాత కొన్ని సూపర్ హిట్ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రావడంతో ప్రేక్షకులు థియేటర్లకు అతి తక్కువ కాలంలోనే అలవాటు అయ్యారు కానీ రెండవ దశ అయిన తర్వాత ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి చాలా ఆలోచన చేస్తున్నారు.

దానికి తోడు రెండవ దశ తర్వాత విడుదలైన సినిమాలు కూడా ప్రేక్షకులను మెప్పించలేక పోవడంతో సినిమా వారికి ఇంకా కష్టాలు పెరిగాయి అని చెప్పవచ్చు. ఒక్కటంటే ఒక్క సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించే సినిమా రాలేదు. కానీ ఇటీవలే సిటిమార్ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆ సినిమా ప్రేక్షకులను కొంత వరకు థియేటర్లకు రప్పించడం లో సక్సెస్ అయ్యింది ఆ తరువాత ఈ రోజు విడుదలైన లవ్ స్టోరీ సినిమా సూపర్ హిట్ కావడంతో ఈసారి తప్పకుండా ప్రేక్షకులు వందకు వందశాతం థియేటర్లకు వస్తారని ఆశిస్తున్నారు ఈ నేపథ్యంలో లవ్ స్టోరీ సినిమా టాలీవుడ్ గతిని మారుస్తుందా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: