అలనాటి తార సినీ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇవ్వనుందా..?

Divya

తెలుగు సినీ ఇండస్ట్రీలో అలనాటి  కాలంలో ఎంతో మంది స్టార్ హీరోయిన్లు గా మెరిసిన తారలు , ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలని చూస్తున్న విషయం తెలిసిందే. అందులో ఆల్రెడీ కొంతమంది హీరోయిన్లు ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తమ కెరీర్ ను కొనసాగిస్తున్నారు.. ఇక ఇప్పుడు అలనాటి అందాల తార  సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలని చూస్తోందట.. ఆమె ఎవరో కాదు నిన్నటితరం కథానాయిక లలో ఒకరిగా గుర్తింపు పొందిన రాధ..

రాధ.. అందానికి మించిన అభినయం.. డాన్స్ చేయడంలో కూడా తన ప్రత్యేకతను చాటుకుంది.. 80 వ  దశకంలో స్టార్ హీరోయిన్స్ గా గుర్తింపు పొందిన హీరోయిన్లలో విజయశాంతి తర్వాత అంతటి పేరు వినిపించింది రాధా పేరు మాత్రమే. ఈమె స్టార్ హీరోలందరితో జతకట్టి స్టెప్పులేసిన విషయం తెలిసిందే. ఇక ఎక్కువగా చిరంజీవితోనే జత కట్టి సినీ ఇండస్ట్రీలో మంచి హిట్ జోడి గా గుర్తింపు పొందింది. ఇకపోతే ఈమె గురించి ప్రముఖ రచయిత పరుచూరి ..పరుచూరి పలుకులు కార్యక్రమంలో ప్రస్తావించాడు.
అలనాటి తారల గురించి మాట్లాడాలి అంటే, ప్రముఖ స్టార్ హీరోయిన్ రాధ గురించి మాట్లాడాలి. ఒకసారి ఎన్టీఆర్ నన్ను ఒక సినిమా కథ రెడీ చేయమని చెబితే, నేను చండశాసనుడు సినిమా కథ రాసుకుని  ఎన్.టి.ఆర్ కు వినిపించాను. అప్పుడు ఆయనకు ఈ కథ నచ్చడంతో, మొదటిసారి రాధ ను ఈ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశాము. చిరంజీవి తో సమానంగా స్టెప్పులేసి అందరినీ మెప్పించింది.
సినిమాలలో నటించేటప్పుడు కొన్ని అసభ్యకర పాత్రలు చేయాలి అన్న, మాటలు మాట్లాడాలి అన్న ఆమెకు చాలా భయం.. ఒకసారి సినిమా షూటింగ్ లో చిరంజీవి తో ఒక సినిమా తీసేటప్పుడు, అసభ్యకర మాటలు మాట్లాడాల్సి వస్తే దర్శకుడితో ఆమె బ్రతిమలాడుతూ డైలాగ్ మార్చమని అడుగుతూ ఉంటే, స్వయంగా నేనే చూసాను అంటూ పరుచూరి తెలిపాడు.. ఇక ఇలాంటి ఒక స్టార్  హీరోయిన్ తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అక్కగానో వదిన గానో రీ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది అని అభిమానులతోపాటు ఆయన కూడా కోరుకున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: