వెండితెరపై హీరోయిన్ ల దాగుడు మూతలు..!

NAGARJUNA NAKKA
మీడియం రేంజ్‌ మూవీస్‌కి అందుబాటులో ఉండే లావణ్య త్రిపాఠి, అనుపమ పరమేశ్వరన్‌ లాంటి హీరోయిన్లు సక్సెస్‌ రేస్‌లో వెనకబడిపోయారు. లావణ్యకి చాన్నాళ్లుగా సరైన హిట్‌లేదు. 'మిస్టర్, రాధ, యుద్ధం శరణం, ఇంటిలిజెంట్, ఎ1 ఎక్స్‌ప్రెస్, చావు కబురు చల్లగా' లాంటి ఫ్లాపులతో డల్‌ అయ్యింది. అనుపమ పరమేశ్వరన్ బిగినింగ్‌లో మంచి హిట్స్ కొట్టింది. 'అఆ, ప్రేమమ్, శతమానం భవతి' లాంటి సినిమాలతో లక్కీమస్కట్‌లా కనిపించింది. కానీ ఆ తర్వాత 'కృష్ణార్జున యుద్ధం, తేజ్ ఐ లవ్‌ యు' ప్లాపులతో కొంచెం స్లో అయ్యింది. ఈ లోపు మళయాళం సినిమాలతో తెలుగునాట కొంచెం గ్యాప్ వచ్చింది.
'హలో' సినిమాతో పలకరించిన కళ్యాణి ప్రియదర్శన్ 'రణరంగం' ఫ్లాప్ తర్వాత మళ్లీ కనిపించలేదు. అలాగే బెస్ట్ పెర్ఫామర్ అనిపించుకున్న నివేదా థామస్‌ 'జై లవకుశ' తర్వాత పై చదువుల కోసం సినిమాలకి బ్రేక్ ఇచ్చింది. ఇక ఈ బ్రేక్ తర్వాత నివేదాకి మళ్లీ మునుపటి రేంజ్‌లో అవకాశాలు రావడం లేదు. రష్మిక మందన్న 'చలో, గీత గోవిందం' హిట్స్‌తో మీడియం రేంజ్ హీరోలకి బెస్ట్ ఆప్షన్‌గా కనిపించింది. అయితే ఈ హీరోయిన్ ఎప్పుడైతే మహేశ్‌ బాబుతో 'సరిలేరు నీకెవ్వరు' చేసిందో అప్పటి నుంచి స్టార్ లీగ్‌లో చేరిపోయింది. దీనికితోడు బాలీవుడ్‌లో రెండు సినిమాల్లో నటిస్తోంది. ఇక ఈ స్టార్డమ్‌తో చిన్న బడ్జెట్‌ సినిమాలకి దూరమైంది రష్మిక.


పూజా హెగ్డే స్టార్ హీరోలతో పాటు మీడియం రేంజ్ హీరోస్‌తో కూడా సినిమాలు చేస్తోంది. వరుణ్‌ తేజ్‌తో 'గద్దలకొండ గణేష్' చేసిన పూజ, ఇప్పుడు అఖిల్‌తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమా చేస్తోంది. అయితే పూజ రెమ్యూనరేషన్‌ 3 కోట్లకి చేరింది. పూజా హెగ్డే, రష్మిక మందన్న లాంటి వాళ్లు రెమ్యునరేషన్ పెంచారు. అయితే చిన్న సినిమాలు హీరోయిన్‌కి ఇంతమొత్తం ఇవ్వడం కష్టమే. అందుకే మీడియం రేంజ్ మూవీస్‌ని దూరం పెడుతోంది పూజ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: