అక్కినేని జంట అక్కడ సెటిల్ ..?

NAGARJUNA NAKKA
అక్కినేని నాగచైతన్య, సమంత ఫ్యాన్స్ కు ఝలక్ ఇస్తున్నారు. వరుస సినిమాలతో టాలీవుడ్ ను ఏలిన ఈ జంట ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీని కాస్త పక్కన పెట్టి బాలీవుడ్ లో తమ సామ్రాజ్యాన్ని విస్తరించేలా చూస్తోంది. ఇన్ని రోజులు దక్షిణాది మార్కెట్ ను ఏలిన ఈ కపుల్ ఇప్పుడు బాలీవుడ్ బాక్సాఫీస్ ను బద్దలు కొట్టాలని చూస్తోంది. ఇప్పటికే నాగచైతన్య పెద్ద సినిమాతో ఉత్తరాదిన ఎంట్రీ ఇచ్చేశాడు. సమంత కూడా వెబ్ సిరీస్ తో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తోంది.
నాగచైతన్య ఇన్నాళ్లూ తెలుగు సినిమాలతోనే సరిపెట్టుకున్నాడు. కనీసం కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్ వుడ్ లో కూడా అడుగుపెట్టలేదు. అతిథి పాత్రల్లో నటించాడు తప్ప పూర్తిస్థాయిలో యాక్ట్ చేయలేదు. ఏకంగా బాలీవు్డ లోనే అడుగు పెట్టేశాడు.కానీ ఇప్పుడు టాలీవుడ్‌ స్టార్స్‌ అంతా బాలీవుడ్‌ని ఫోకస్ చేస్తున్నారు. దీంతో నాగచైతన్య కూడా హిందీకి వెళ్తున్నాడు. ఆమిర్‌ఖాన్ 'లాల్‌ సింగ్ చద్దా'లో ప్రముఖ పాత్ర వహిస్తున్నాడు నాగచైతన్య.  
సమంతకి పెళ్లి తర్వాత కమర్షియల్ సినిమాల్లో పెద్దగా అవకాశాలు రావడం లేదు.  లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్‌తోనే సర్దుకుంటోంది. స్టార్ హీరోలు కూడా థర్టీ ప్లస్‌లో ఉన్న సామ్‌తో స్టెప్పులేసేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దీంతో బాలీవుడ్‌కి వెళ్లాలనుకుంటోందట సమంత. సమంతకి 'ఫ్యామిలీ మెన్2'తో హిందీ మార్కెట్‌లో కూడా గుర్తింపు వచ్చింది. రాజ్, డికె తీసిన ఈ వెబ్‌ సీరీస్‌తో నార్త్ ఆడియన్స్‌కి కూడా బాగానే కనెక్ట్ అయ్యింది. అలాగే 'శాకుంతలం' సినిమా కూడా నార్త్‌లో భారీగానే విడుదల కాబోతోంది. ఇక ఈ సీరీసులని, సినిమాలని వాడుకొని హిందీలో బిజీ కావాలనుకుంటోందట సమంత.
మొత్తానికి నాగచైతన్య, సమంత ఫ్యాన్స్ కు ఊహించని షాకే ఇస్తున్నారు. చూద్దాం.. బాలీవుడ్ కే పరిమితమైతారా.. లేక మళ్లీ టాలీవుడ్ లో సినిమాలు చేసుకుంటారా చూద్దా... ఏది ఏమైనా వారికి ఆల్ ది బెస్ట్ చెబుదాం..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: