మరొకసారి పవర్ స్టార్ తో మూవీ ప్లాన్ చేస్తున్న దిల్ రాజు .... ??

GVK Writings
దిల్ సినిమాతో టాలీవుడ్ కి నిర్మాతగా అడుగుపెట్టిన రాజు, ఆ సినిమాతో భారీ సక్సెస్ ని సొంతం చేసుకున్నారు. నితిన్ హీరోగా నటించిన ఈ సినిమాకి వివి వినాయక్ దర్శకుడు. ఆ తరువాత నుండి ఒక్కొక్కటిగా నిర్మాతగా సినిమాలు చేస్తూ కొనసాగిన రాజు, అనంతరం వాటితో పలు భారీ సక్సెస్ లు సాధించి నిర్మాతగా మంచి పేరు దక్కించుకున్నారు. ఇక దిల్ రాజు బ్యానర్ నుండి సినిమా వస్తుంది అంటే అది చాలా వరకు మంచి సినిమానే అయి ఉంటుందని అనే భావన మన తెలుగు ఆడియన్స్ లో ఉంది.
నిజానికి అంతకముందు కొన్నాళ్ల క్రితం సరైన సక్సెస్ లేని రాజు, ఇటీవల మాత్రం మంచి విజయాలు సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక తన కెరీర్ లో తనకు ఎంతో ఇష్టమైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా చేయాలని ఎప్పటినుండో భావించిన రాజుకి ఇటీవల ఆయన కం బ్యాక్ మూవీ వకీల్ సాబ్ ద్వారా ఆ ఛాన్స్ లభించింది. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా యాక్ట్ చేయగా వేణు శ్రీరామ్ దీనిని తెరకెక్కించారు. అయితే మంచి అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ హిట్ కొట్టి తొలిసారిగా దిల్ రాజు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల కాంబినేషన్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది.
ఇక మ్యాటర్ ఏమిటంటే, అతి త్వరలో మరొకసారి పవర్ స్టార్ తో ఒక భారీ మూవీని దిల్ రాజు నిర్మించనున్నారు అనే వార్త ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మొత్తం నాలుగు సినిమాల చేస్తుండగా, ఆ తదుపరి ఆయన చేయబోయే ఐదవ సినిమాని నిర్మించనున్నది దిల్ రాజు అని, ఇప్పటికే వారిద్దరి కాంబో మూవీ కోసం ఒక స్టార్ డైరెక్టర్ పవర్ఫుల్ స్టోరీ కూడా సిద్ధం చేసే పనిలో ఉన్నారని సమాచారం. అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమా పట్టాలెక్కవచ్చట. అలానే వచ్చే ఏడాది మొదట్లో ఈ మూవీ అనౌన్స్ మెంట్ కూడా ఉండదనున్నట్లు టాక్. మరి ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందొ తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే అంటున్నారు సినీ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: