బాలయ్య Vs వెంకీ.. ఇక దబిడి దిబిడే..!!

Anilkumar
కరోనా మహమ్మారి కారణంగా అన్ని రంగాలతో పాటు సినిమా పరిశ్రమ కూడా తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటుంది.ఒకవైపు షూటింగ్ లు లేక మరోవైపు రిలీజ్ కు సిద్ధంగా ఉన్న సినిమాలు అన్ని ఆగిపోయాయి. దీనితో అనేక ఇబ్బందులు పడుతున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.అయితే ఈ పాండమిక్ తర్వాత రిలీస్ అయిన  'క్రాక్' సినిమా సక్సెస్ అవడంతో మిగతా సినిమాలు కూడా విడుదలకు రెడీ అయ్యాయి.కానీ ఇంతలోనే  కరోనా సెకండ్ వేవ్ దెబ్బేసింది. దీనితో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. దీనితో ఏమీ చేయలేక కొన్ని సినిమాలను ఓటీటీల్లో రిలీజ్ చేస్తున్నారు.వీటన్నిటి తరువాత ఎట్టకేలకు షూటింగులు స్టార్ట్ అయ్యాయి. దీనితో ప్రేక్షకులు మళ్ళీ మెల్లగా థియేటర్లబాట పడుతున్నారు.

అయితే తాజాగా సీటీమార్' సినిమాతో మంచి సినిమాను ఆడియన్స్ ఆదరిస్తారని చెప్పొచ్చు.అయితే ఇప్పటికే నెమ్మదిగా చిన్న చిన్న సినిమాలు తెరకెక్కుతున్నాయి.దీనితో పాటుగా రిలీస్ డేట్లను కూడా ఫిక్స్ చేసుకుంటున్నారు. కానీ పాన్ ఇండియా సినిమాలు, పెద్ద చిత్రాలు మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతున్నాయి.అయితే  ఇటీవల 'నారప్ప' మూవీని ఓటీటీలో విడుదలచేశారు.ఇదిలాఉండగా  అప్పుడు ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసిన 'దృశ్యం 2' ని డిజిటల్ ప్లాట్‌ఫాం ద్వారానే రిలీజ్ చెయ్యబోతున్నారని వార్తలు వచ్చాయి కానీ ఈ విషయం పై ఇంకా స్పష్టత రాలేదు.ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాని దసరా కానుకగా థియేటర్స్ లోనే విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

 ఇక త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారట చిత్ర యూనిట్. అయితే వెంకీ ఒక్కరే కాకుండా దసరా సీజన్ మీద బాలయ్య కూడా కన్నేశారని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం దృశ్యం 2 అక్టోబర్ 13న రిలీజ్ కానుందని తెలుస్తోంది. దీని తరువాత ఒకరోజు కూడా గాప్ లేకుండా తర్వాత రోజైన అక్టోబర్ 14న బాలయ్య నటించిన 'అఖండ' సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారని తెలుస్తోంది.దీంతో ఈసారి ఇద్దరు సీనియర్ హీరోలు అయిన బాలయ్య, వెంకీ ల మధ్య దసరా పోరు గట్టిగానే ఉండబోతోంది. మరి ఈ పోటీలో ఎవరు ఎలాంటి ఫలితాల్ని అందుకుంటారో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: