కారులో భర్త చేసిన పనికి.. నవ్వుకున్న శ్రీయ?

praveen
బాలీవుడ్ వెటరన్ హీరోయిన్ శ్రేయ ఇటీవల తన భర్తతో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంది అన్న విషయం తెలిసిందే.  కాగా తిరుపతి లో సందడి చేసిన ఈ జంట అక్కడినుండి వెను తిరిగింది.  అయితే శ్రియ తన భర్త సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడూ తమ పర్సనల్ లైఫ్ కి సంబంధించిన ఫోటోలను వీడియోలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఎప్పుడు అభిమానులను అలరిస్తు సోషల్ మీడియాలో అంతకంతకూ ఫాలోయింగ్ సంపాదిస్తున్నారు  ఇకపోతే ఇటీవల శ్రియ దంపతులు రష్యా నుంచి నేరుగా ముంబయి వచ్చారు. ఇక్కడ ఒక ఇంటిని కూడా కొనుక్కున్నారు.

 ఇక ఇటీవల శ్రియ తన సినిమా ప్రమోషన్ లో భాగంగా చాలా రోజుల తర్వాత హైదరాబాద్లో వాలిపోయింది. అంతకుముందు    తన భర్తతో కలిసి ఏకంగా శ్రీవారి సన్నిధిలో ఆశీర్వచనాలు కూడా తీసుకుంది. అయితే ఈ జంట ఒకదగ్గర ఉన్నారు అంటే ఎప్పుడూ సరసాలు ఆడుకుంటూ ఉండటం లాంటివి చేస్తూ ఉంటారు. వీరి సరసాలనే వీడియోలు గా మార్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇక వీరిద్దరూ చేసే అల్లరికి అటు అందరూ ఫిదా అవుతారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇటీవలే శ్రీవారిని దర్శించుకుని కారులో వెనుదిరిగిన ఈ జంట కారులో కూడా సరసాలు ఆపలేదు.

 కారులో వస్తున్న సమయంలో భార్య శ్రేయను కుదురుగా ఉండనివ్వలేదు భర్త ఆండ్రు.  చేతిలో పట్టుకొని ఆమె చెవిలో చెక్కిలిగింతలు పెట్టడం చేస్తున్నాడు. ఇలా చేస్తుండటంతో అటు శ్రీయ కూడా ఎంతో సిగ్గుపడుతూ నవ్వుకుంది. ఈ క్రమంలోనే నవ్వుతూనే భర్తను వారించే ప్రయత్నం చేసింది. ఇక దీనికి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది కాస్తా వైరల్ గా  మారిపోయింది.  ఇక దీనిపై అటు దర్శకులు భిన్నమైన కామెంట్లు పెడుతున్నారు. వామ్మో వీళ్ళు ఎక్కడా తగ్గట్లేదు కదా అని అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: