కాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఇంద్రజ...?
ఈ విషయం గురించి ఎంతోమంది సినీ తారలు సినీ పరిశ్రమలోకి వచ్చిన మొదట్లో క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నామని తెలియచేసినప్పటికీ వారిని అలా ఇబ్బంది పెట్టిన దర్శక నిర్మాతల పేర్లను మాత్రం బయటకు చెప్పడానికి వెనకడుగు వేస్తున్నారని సమాచారం.
ఈ క్రమంలోనే కాస్టింగ్ కౌచ్ గురించి అప్పటి స్టార్ హీరోయిన్ అయిన ఇంద్రజ ఓ సందర్భంగా స్పందించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారని సమాచారం. క్యాస్టింగ్ కౌచ్ అనేది కేవలం సినిమా పరిశ్రమలో మాత్రమే కాకుండా ప్రతి ఒక్క రంగంలోనూ ఉందని ఈమె తెలియజేశారని తెలుస్తుంది. అయితే ఆడ పిల్లలు ఇంటి నుంచి అడుగు బయట పెట్టేటప్పుడు వారు ఎక్కడికి వెళ్తున్నారో అక్కడ ఏ విధమైనటువంటి సమస్యలు వారికీ ఎదురైతే వాటిని ఏ విధంగా పరిష్కరించుకోవాలని స్పష్టమైన అవగాహనతో ఇంటి నుంచి అడుగు బయట వెళ్ళాలని చెప్పినట్లు సమాచారం.కానీ అవకాశాల కోసం మన వ్యక్తిత్వాన్ని చంపుకోకూడదని తెలిపారని సమాచారం.
మీరు తీసుకున్నటువంటి ఈ విధమైన కఠిన నిర్ణయానికి మీరు కట్టుబడి ఉండాలని తెలిపారట. అలా కట్టుబడి ఉంటే నలుగురిలో ఒకరిలా కాకుండా, నలుగురిలో మీరొక్కరే ఎంతో ప్రత్యేకంగా కనబడతారని సమాచారం.మొదట్లో మనం తీసుకున్న నిర్ణయాలు కఠినంగా ఉన్నప్పటికీ కొన్ని అవకాశాలు చేజారిపోయిన ఆ తర్వాత మరికొన్ని అవకాశాలు దక్కుతాయని చెప్పారట.అంతేకానీ అవకాశాల కోసం మన వ్యక్తిత్వాన్ని చంపుకొని తర్వాత పొరపాటు చేశాను.. ఆ సమయంలో అలా చేయకుండా ఉంటే బాగుంటుందని బాధపడటం వృధా అంటూ ఇంద్రజ ఇంటర్వ్యూ సందర్భంలో క్యాస్టింగ్ కౌచ్ గురించి ఎంతో అద్భుతంగా తెలియజేశారని సమాచారం. చాలాకాలం క్రితం నుంచి సినిమా ఇండస్ట్రీకి దూరమైన ఇంద్రజ ప్రస్తుతం బుల్లితెరపై పలు కార్యక్రమాలకు జడ్జిగా వ్యవహరిస్తూ మరోసారి ప్రేక్షకులను సందడి చేస్తున్నారని తెలుస్తుంది.