లేడి ఓరియెంటెడ్ మూవీతో తన సత్తా చాటబోతున్న రష్మిక..!

Divya
హీరోయిన్ రష్మిక మొదట తెలుగు లోకి ఛలో సినిమా ద్వారా అరంగేట్రం చేసి,ఆ తర్వాత స్టార్ హీరోలతో సినిమాలు చేసే రేంజ్ కు ఎదిగిపోయింది. ఈమె కన్నడ భామ అయినప్పటికీ తెలుగులో ఒక స్టార్ హీరోయిన్ గా ఎదుగుతూ ..ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్లో తన సినిమాలతో బాగా గుర్తింపు పొందుతోంది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన అతి తక్కువ సమయంలోనే నటించే అవకాశాన్ని కొట్టేసి, సరిలేరు నీకెవ్వరు సినిమా తో సరిలేరు నాకెవరు అంటూ సినీ ఇండస్ట్రీలో దూసుకుపోతున్న హీరోయిన్ గా గుర్తింపు పొందింది రష్మిక. ఇకపోతే త్వరలోనే లేడి ఓరియెంటెడ్ గా ప్రేక్షకుల ముందుకు దర్శనం ఇవ్వడానికి సిద్ధమవుతోంది ..దాని వివరాలు ఏంటో ఒకసారి పూర్తిగా తెలుసుకుందాం..
గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మాణంలో ఈమె ప్రముఖ హీరోయిన్ గా లేడీ ఓరియెంటెడ్ పాత్రలో తెరకెక్కబోయే సినిమాకు ఓకే చెప్పినట్లు సమాచారం. ఇక ఈ సినిమాకు ఒక యంగ్ డైరెక్టర్ అలాగే నటుడు అయిన రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు.. అయితే ఇతను గతంలో కూడా చిలసౌ అనే ఒక సినిమా పేరుతో ఓరియంటెడ్ సినిమాను తెరకెక్కించి అక్కడ కూడా మంచి విజయాన్ని అందుకున్నాడు. అయితే నాగార్జున తో మన్మధుడు సీక్వెల్ మన్మధుడు టు తో వచ్చి కొంచెం బోల్తా కొట్టడంతో ఈయనకు అవకాశాలు రాలేదనే చెప్పాలి.. అయితే గత కొద్ది కాలంగా ఆయన కథను సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం..
చివరిగా తను రాసుకున్న కథతో గీతాఆర్ట్స్ నిర్మాతలను ఒప్పించి, లేడీ ఓరియంటెడ్ సినిమాకు హీరోయిన్ రష్మిక ను ఫైనల్ చేసుకున్నాడట. గీత గోవిందం సినిమాను కూడా గీత ఆర్ట్స్ సంస్థ వారు నిర్మించిన విషయం తెలిసిందే. అయితే గీత గోవిందం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈ అమ్మడు ,ఈ లేడి ఓరియెంటెడ్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాతో మరింత విజయాన్ని అందుకుంటుందో లేదో మనం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: