పెద్ద హీరోలతో రొమాన్స్ కు ఛాన్స్.. కారణం అదే..!
సమంత తెలుగు, తమిళ్లో బోల్డన్ని సూపర్ హిట్స్ అందుకుంది. లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌తోనూ మెప్పించింది. అయితే సామ్ సినిమాల్లో 10 ఏళ్లు కష్టపడితే ఎంత పేరు వచ్చిందో, ఒకే ఒక్క వెబ్ సీరీస్ 'ఫ్యామిలీమేన్2'తో అంతకంటే ఎక్కువ పేరు వచ్చింది. తమిళ ఈలం కమాండర్ రాజీ పాత్రతో బోల్డన్ని ప్రశంసలు అందుకుంది.
'ఫ్యామిలీమేన్2'తో సమంత నార్త్ ఆడియన్స్‌కి కూడా కనెక్ట్ అయ్యింది. సామ్ పెర్ఫామెన్స్‌కి బాలీవుడ్ నుంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఇప్పుడీ మార్కెట్‌ని మరింత పెంచుకోవడానికి గుణ శేఖర్ దర్శకత్వంలో పాన్ ఇండియన్ మూవీ 'శాకుంతలం' చేసింది.
ప్రియమణికి పెళ్లి తర్వాత సినిమాలు తగ్గిపోయాయి. టీవీ షోస్‌తో కెరీర్ నెట్టుకొస్తోంది. ఇలాంటి టైమ్‌లోకి ప్రియమణికి షారుఖ్ ఖాన్, అట్లీ సినిమాలో ఆఫర్ వచ్చింది. మరి బాలీవుడ్ నుంచి పిలుపు రావడానికి 'ఫ్యామిలీమెన్' సీరీసే కారణమంటున్నారు సినీజనాలు. ఈ వెబ్ సీరీస్‌తో ప్రియకి హిందీలో మంచి గుర్తింపు దక్కింది. ఈ స్టార్డమ్‌ని క్యాష్ చేసుకోవడానికి ప్రియమణికి ఆఫర్ ఇచ్చారట అట్లీ, షారుఖ్.