ఫస్ట్ హాఫ్ కామెడీ అట .. సెకండ్ హాఫ్ కుమ్ముడట ... ??

GVK Writings
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు పెద్ద అభిమాని అయిన మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్, ఆయనతో ఫస్ట్ టైం చేసిన సినిమా గబ్బర్ సింగ్. బాలీవుడ్ లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించ దబాంగ్ మూవీకి తెలుగు రీమేక్ గా ఎంతో గ్రాండ్ లెవెల్లో రూపొందిన ఈ సినిమాని బండ్ల గణేష్ నిర్మించగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. 2012లో ప్రేక్షకాభిమానులు ముందుకు మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుంది.

యువ భామ శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో అభిమన్యు సింగ్ విలన్ గా నటించగా ఇతర క్యారెక్టర్స్ లో కోట శ్రీనివాసరావు, సుహాసిని, నాగినీడు, అజయ్ తదితరులు నటించారు. ఇక దబాంగ్ మూవీ స్టోరీ ని మన తెలుగు ప్రేక్షకులు మెచ్చేలా, ముఖ్యంగా పవర్ స్టార్ నుండి ఆయన ఫ్యాన్స్ కోరుకున్న అన్ని అంశాలు మిళితం చేసి దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమాని ఎంతో గ్రాండ్ గా తీశారు. అయితే తొమ్మిదేళ్ల గ్యాప్ తరువాత మరొక్కసారి పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై చేయనున్న సినిమా భవదీయుడు భగత్ సింగ్. నేడు టైటిల్ అనౌన్స్ మెంట్ వచ్చిన ఈ సినిమాలో పవర్ స్టార్ పాత్ర నెవర్ బిఫోర్ నెవర్ ఎగైన్ అనీ రీతిలో ఉంటుందట.

ఇక లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ చాలా వరకు మంచి కామెడీ, ఎంటర్టైన్మెంట్ తో సాగడంతో పాటు సెకండ్ హాఫ్ భారీ యాక్షన్, కమర్షియల్ హంగులతో పాటు మాస్ ఫైట్స్ కూడా ఉంటాయట. ఆ విధంగా ఫస్ట్ హాఫ్ కామెడీ, సెకండ్ హాఫ్ కుమ్ములాట తో సాగెలా అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమా స్క్రిప్ట్ రాసుకున్నట్లు టాక్. మరి ఇదే కనుక నిజం అయితే మరొక్కసారి పవర్ స్టార్, హరీష్ శంకర్ ల కాంబోలో మరొక బ్లాక్ బస్టర్ ఖాయం అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: