షాకింగ్ 60 కోట్ల పారితోషికం వైపు పవన్ అడుగులు ?
పవన్ కళ్యాణ్ ఈపేరు వింటేనే అతడి అభిమానులు పూనకంతో వీరంగం సృష్టిస్తారు. కేవలం సగటు ప్రేక్షకులు మాత్రమే కాదు వీరేంద్ర సెహ్వాగ్ లాంటి ప్రముఖ క్రికెటర్ కూడ పవన్ డైలాగ్స్ ను అనుసరిస్తూ వీడియోలు షేర్ చేస్తున్న పరిస్థితి చూస్తూ ఉంటే పవన్ మ్యానియా ఏ రేంజ్ లో ఉందొ అర్ధం అవుతుంది.
‘అజ్ఞాతవాసి’ ఫ్లాప్ తరువాత సినిమాల నుంచి గ్యాప్ తీసుకుని రాజకీయాలలోకి వెళ్ళి అక్కడ పరాజయం చెందినప్పటికీ పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు అన్నవిషయం ఈ ఏడాది విడుదల అయిన ‘వకీల్ సాబ్’ మూవీ అందరికి తెలిసి వచ్చేలా చేసింది. కరోనా సెకండ్ వేవ్ సమయంలో విడుదల అవడం వల్ల కలెక్షన్స్ కాస్త తగ్గినప్పటికీ ఈ సినిమా మేకర్స్ కు ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్ గా నిలిచింది అని అంటారు.
పవన్ కళ్యాణ్ ఈసినిమా కోసం 50కోట్లు రెమ్యూనరేషన్ గా తీసుకున్నాడనే వార్తలు వచ్చాయి. ప్రస్తుతం పవన్ మరో 5 చిత్రాలను లైన్ లో పెట్టాడు. అయితే కెరీర్ లో ఎప్పుడూ లేనివిధంగా ఒక ప్రాజెక్ట్ సెట్స్ మీద ఉండగానే మరో సినిమా షూటింగ్ ప్రారంభించి ఒకేసారి రెండు సినిమాలకు సంబంధించిన చిత్రీకరణలో పాల్గొంటూ రికార్డు క్రియేట్ చేస్తున్నాడు. ‘భీమ్లా నాయక్’ షూటింగ్ పూర్తి అయిన తరువాత ‘హరి హర వీరమల్లు’ చిత్రీకరణను తిరిగి ప్రారంభిస్తాడట.
ఈమూవీ తరువాత హరీష్ శంకర్ సినిమాని సెట్స్ మీదకు తీసుకు వెళ్ళే ఆలోచనలో ఉన్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ తన పారితోషికాన్ని పెంచేసాడని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం తీసుకుంటున్న రెమ్యూనరేషన్ కు అదనంగా మరో 10కోట్లు కలిపి మొత్తంగా 60కోట్లు తీసుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన హరీష్ శంకర్ పవన్ పక్కన హీరోయిన్ గా పూజ హేగ్ద్ ను ఎంపిక చేసే అవకాశం ఉంది అంటున్నారు..