తెలుగు ప్రేక్షకులపై సూర్య ట్రేడ్మార్క్ సినిమా సింగం?

praveen
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలు వస్తున్నాయంటే చాలు ఇక ప్రేక్షకులందరూ థియేటర్ల వద్దకు చేరుకొని సందడి చేస్తూ ఉంటారు. ఏదైనా కొత్త సినిమా విడుదలైంది అంటే చాలు సినిమా హాల్ వద్ద హడావిడి ఏ రేంజిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే కేవలం తెలుగు హీరోల సినిమాలకే కాదు అటు తమిళ కన్నడ హీరోల సినిమాలు వచ్చినా కూడా ఎంతో మంది తెలుగు ప్రేక్షకులు పోటీపడి మరీ సినిమాలు చూస్తూ ఉంటారు. అయితే ఇది ఇప్పటి నుంచి వస్తుంది కదా  ఎన్నో ఏళ్ల నుంచి ఇలా తమిళ తెలుగు ఇండస్ట్రీ కి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ ఈ క్రమంలోనే అటు తెలుగు ప్రేక్షకులు కూడా తమిళ హీరోలని ఎంతగానో ఆదరిస్తూ ఉంటారు.

 దీంతో ప్రస్తుతం చాలా మంది కొలీవుడు హీరోలు తమ సినిమాలను టాలీవుడ్లో కూడా విడుదల చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇలా కోలీవుడ్ హీరో అయినప్పటికీ అచ్చంగా టాలీవుడ్ హీరో లాగా మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో సూర్య.  ఇప్పటివరకు సూర్య నటించిన ఎన్నో సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యి ఒక మంచి విజయాన్ని సాధించాయి.  అయితే సూర్య ఎన్ని సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ అటు తెలుగు ప్రేక్షకులందరికీ సూర్య ట్రేడ్మార్క్ సినిమా మాత్రం సింగం సినిమా అనే చెప్పాలి.

 సింగం సినిమాలో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు సూర్య.  పోలీస్ అంటే ఎంత పవర్ ఫుల్ గా ఉంటాడు అనే విషయాన్ని చూపించి ఎంతోమంది పోలీసులకి ఆదర్శంగా మారిపోయారు. అయితే ఇక సింగం సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఇక ఈ సినిమాకు మరో రెండు పార్టులు కూడా తెరకెక్కించారు. ఇక ఈ రెండు పార్టులు కూడా అటు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.  ఇక సింగం సినిమా ఇప్పుడు వచ్చినా కూడా టీవీలకు అతుక్కుపోయి మరి ప్రేక్షకులు చూస్తారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సింగం సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు సూర్య.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: