మెగాస్టార్ కు ఆయన హీరోయిన్ కలిసి రాలేదా...?
ఇక ఈ నేపథ్యంలో ని చిరంజీవి- విజయశాంతి మరియు ,చిరంజీవి - రాధిక అలాగే చిరంజీవి - రాధ. ఈ ముగ్గురితో వచ్చిన అన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాయని సమాచారం.. 1980వ సంవత్సరంలో వచ్చిన హీరోయిన్స్ లో ఎక్కువ చిత్రాలు నటించినప్పటికీ , అంతకు ముందు వచ్చిన జయసుధ, సుజాత, జయప్రద వంటి హీరోయిన్స్ తో నటించిన చిరంజీవి ..సినిమాలు మాత్రం పెద్దగా విజయం సాధించలేదు..
ఇకపోతే 1970వ సంవత్సరంలో జయసుధ తో చిరంజీవి ఆడవాళ్లు మీకు జోహార్లు మరియు ప్రాణం ఖరీదు అలాగే పులి బెబ్బులి, మగధీరుడు లాంటి చిత్రాల్లో హీరోగా నటించాడట. ఇక జయప్రద విషయానికొస్తే 1975 సంవత్సరకాలంలో సినీపరిశ్రమలోకి జయప్రద అడుగుపెట్టిందని సమాచారం. భూమికోసం అనే చిత్రంతో తన సినీ జీవితాన్ని మొదలుపెట్టిందట. ఆ తరువాత అడవిరాముడు సినిమాతో ఆమె స్థాయి అందనంత ఎత్తుకు ఎదిగిందని సమాచారం. అప్పటి వరకు పెద్ద హీరోలతో నటించిన జయప్రద 1985 లో కుర్ర హీరోలతో నటించే అవకాశం వచ్చిందని సమాచారం. చిరంజీవి - జయప్రద కాంబినేషన్లో కొన్ని చిత్రాలు రావడం జరిగిందని సమాచారం..
1980 లో అంజలి పిక్చర్స్ బ్యానర్ పై వి.మధుసూధనరావు దర్శకత్వంలో వచ్చిన చండీప్రియ సినిమా విడుదలైందని సమాచారం.. ఒక నవల ఆధారంగా తెరకెక్కించారని తెలుస్తుంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ ని ఫ్యామిలీ హీరో అయిన శోభన్ బాబు, చిరంజీవి మరియు జయప్రద ల మధ్య జరుగుతుందట. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద భారీ పరాజయాన్ని మూట కట్టుకుందని సమాచారం. ఆ తర్వాత 47 రోజులు అనే సినిమా కూడా వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిందని సమాచారం ఈ సినిమా కూడా భారీ పరాజయం అందుకుందని సమాచారం. ఇక వేట సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోవడంతో ఇక వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా రాలేదని సమాచారం..