చెన్నై వెళ్లిన ప్రతిసారి షకీలా ఇంటికి వెళ్లిన కమెడియన్..కారణం..!

Divya
షకీలా.. సినీ ఇండస్ట్రీలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని, ఆ తర్వాత తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి అని చెప్పవచ్చు.. మలయాళం ద్వారా తన సినీ కెరీర్ ని మొదలు పెట్టి, అన్ని ఇండస్ట్రీలోనీ సినిమాలలో కూడా తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది.. అంతేకాదు యువత నుంచి ముసలి వాళ్ళ వరకు అందరినీ ఉర్రూతలూగించిన శృంగారతార.. పెద్ద పెద్ద టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు ఒకే రోజు విడుదల అయితే ఎంత సందడిగా ఉంటుందో, అంతకంటే ఎక్కువ సందడిని ఈమె సినిమాలు సృష్టించాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇకపోతే ఈమె మలయాళంలో నటించిన  సినిమాలు ఫలానా రోజు విడుదల అవుతున్నాయి అంటే, ఇక మలయాళంలో స్టార్ హీరోలుగా గుర్తింపు పొందిన మమ్ముట్టి ,మోహన్ లాల్ కూడా తమ సినిమాలను వాయిదా వేసుకోక తప్పదు . తన సినిమాలతో స్టార్ హీరోలను కూడా భయపెట్టింది ఈమె.. అంతేకాదు ప్రేక్షకులలో తన క్రేజ్ ఎలా ఉండేది అంటే స్టార్ హీరోలు కూడా ఈ ముందు పనికిరారు అని చెప్పాలి.. మలయాళంలో ఈమె నటించిన చాలా సినిమాలు హిందీలో కూడా డబ్బింగ్ కావడం విశేషం.
ఇకపోతే ఆమెను  పొగిడిన వారే చిన్నగా విమర్శించిన వారు కూడా ఉన్నారు. ఇక అంతే కాదు ఈమె ఒక శృంగార తార అని బయట ప్రపంచానికి మాత్రమే తెలుసు . కానీ ఈమెను ప్రేమిస్తున్నానని ఎంతో మంది సినీ ఇండస్ట్రీ వారు ,రాజకీయ నాయకులు, నిర్మాతలు, డబ్బున్న వ్యాపారవేత్తలు కూడా మోసం చేయడం జరిగింది .మొదట బాగా పరిచయం అయిన తర్వాత చివరకు తను ఎవరో తెలియదు అన్నట్టుగా వెళ్ళిపోయేవారు..

ఇక ఇన్ని కష్టాల్లో ఆమె జీవితం అంటే ఏంటో నేర్చుకుంది.. షకీలా కి సినీ ఇండస్ట్రీలో అభిమానులు కూడా చాలా మందే ఉన్నారు. ఇక అలాంటి వారిలో టాలీవుడ్ దివంగత ప్రముఖ కమెడియన్ గా గుర్తింపు పొందిన వేణుమాధవ్ కూడా. వేణుమాధవ్ షకీలా కు మంచి స్నేహితుడు. ఇద్దరి మధ్య చాలా మంచి అనుబంధం కూడా ఉంది .ఈ విషయాన్ని షకీలా ఒక సందర్భంలో వెల్లడించింది.. ఇకపోతే వేణుమాధవ్ ఎప్పుడు చెన్నై కి వెళ్ళినా షకీల ను కలిసి వస్తాడట. అంతలా వారిద్దరి మధ్య స్నేహబంధం కొనసాగింది. ఇక వేణుమాధవ్ మరణం తో తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. ఇకపోతే ఆమె పెళ్లి చేసుకోలేదు కాబట్టి ఒక ట్రాన్స్ జెండర్ ను దత్తత తీసుకొని ,వారి బాగోగులను షకీలాని చూసుకుంటూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: