సీఎం కాల్ కోసం బాలయ్య వెయిటింగ్..!

NAGARJUNA NAKKA
నందమూరి బాలకృష్ణ ఎంత బిజీగా ఉంటారో అందరికీ తెలుసు. మనిషి ఎంత చలాకీగా ఉంటారో.. సినిమా విషయంలోనూ అంతే దూకుడుగా వ్యవహరిస్తారు. డైలాగ్ లోనైనా.. డ్యాన్స్ లోనై.. ఫైట్ లో నైనా.. తన తర్వాతే ఎవరైనా అంటారు. ముఖ్యంగా స్టేజ్ షోలలో తన టాలెంట్ ఏంటో నిరూపిస్తారు. అలాంటి బాలయ్య సెకండ్ వేవ్ తర్వాత కాస్త స్లో అయ్యారు. ఎందుకంటే కరోనా ప్రభావంతో థియేటర్లు మూతపడటం.. షూటింగ్ లు ఆగిపోవడం చకచకా జరిగిపోయాయి. ఇలాంటి సందర్భంలో షూటింగ్ లకు దూరమైన బాలయ్య కాస్త డిసప్పాయింట్ కు లోనయ్యారు. కానీ ఎప్పుడూ ఏదో ఒకటి చేసేయాలి.. ఏదో ఒక మంచి పని చేయాలని అని ఎపుడూ తపన పడుతూ ఉంటారు. అటు హిందూ పూర్ ఎమ్మెల్యేగా ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో ఉంటూనే.. ఇటు బసవతారక కేన్సర్ ఆస్పత్రిలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ బిజీబిజీగా గడిపారు.

అలాంటి బాలయ్య ఏపీ సీఎం జగన్ ఫోన్ కాల్ కోసం బాలయ్య తెగ వెయిట్‌ చేస్తున్నాడు. ఇదే ఇప్పుడు నందమూరి అభిమాన లోకాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ప్రభుత్వ పాలనను విమర్శించే ఆయన జగన్ ను కలిసేందుకు ఆరాటపడటం వెనుక ఆంతర్యం ఏంటి అనే దానిపై తెగ టెన్షన్ పడిపోతున్నారు ఫ్యాన్స్.  

సాధారణంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. బాలయ్యకు పెద్ద ఫ్యాన్. ఎప్పుడూ కలవాలని ఆరాటపడకపోయినా.. కాలేజీ రోజుల్లో థియేటర్ల దగ్గర పెద్ద పెద్ద బ్యానర్లే ఏర్పాటు చేయించేవారు. అలా తన అభిమానాన్ని చాటుకునే వారు జగన్. ఇటీవల కరోనా పరిస్థితుల దృష్ట్యా.. సినీ పరిశ్రమ సమస్యలపై సీఎం జగన్ సినీ పెద్దలతో చర్చలు జరుపనున్నారు. అయితే తనను పిలుస్తారో లేదో అనే దానికోసం బాలయ్య ఆశగా ఎదురు చూస్తున్నారు.

బాలకృష్ణ, బోయపాటి మూవీ అఖండ  ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకుంది. అక్టోబర్‌ 13న రావాల్సిన ఆర్‌ఆర్‌ఆర్‌ వాయిదాపడడంతో.. అదే రోజు అఖండను విడుదల చేసే ఉద్దేశంలో చిత్ర యూనిట్‌ ఉంది. విడుదల చేసేది లేనిది జగన్మోహన్‌రెడ్డి తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో టిక్కెట్‌ రేట్లు తగ్గిస్తూ  ఏప్రిల్ లో జీఓ విడుదల చేసింది ప్రభుత్వం. ఈ టిక్కెట్‌ రేట్లతో పెద్ద సినిమాలకు ఒరిగిందేమీ లేదు. ముఖ్యమంత్రితో జరిగే సమావేశంలో సినీ పెద్దలు టిక్కెట్‌ రేట్లు పెంచాలని కోరే అవకాశముంది.  ప్రభుత్వం సానుకూలంగా స్పందించి టిక్కెట్‌ ధరలు  పెంచితే అఖండ దసరా బరిలో దిగే ఛాన్స్ ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: