తెలుగు చిత్ర సీమలో కొంతమంది చెరగని సంతకాలు చేశారు. ఒక పాత్రగురించి చెప్పుకుంటే తామే గుర్తు వచ్చేలా పేరు తెచ్చుకున్నారు. అలాంటి వారిలో సిల్క్ స్మిత కూడా ఒకరు. ఓ సైడ్ డ్యాన్సర్ గా కెరీర్ ను మొదలు పెట్టిన సిల్క్ స్మిత తక్కువ కాలంలోనే ఎంతో పేరును సంపాదించకుంది...స్టార్ హీరోల పక్కన ఆడిపాడింది. తన డేట్స్ కోసం నిర్మాతలు...దర్శకులను క్యూలో నిలబెట్టింది. అప్పట్లో ఐటం గర్ల్ అంటే ఎవరికీ తెలియదు. కానీ సిల్క్ స్మిత ఎంట్రీతో ఇప్పటికీ ఐటమ్ గర్ల్ అంటే సిల్కే గుర్తుకు వస్తుంది. కాగా సిల్క్ జీవితంలో ఎన్నో నమ్మలేని నిజాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం...సిల్క్ స్మిత ఆంధ్రప్రదేశ్ లోని దెందులూరులో జన్మించింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా నాలుగో తరగతిలోనే సిల్క్ చదువుకు దూరమయ్యింది.
అంతే కాకుండా పద్నాలుగేళ్లకే సిల్క్ స్మితకు వివాహం జరిగింది. ఆ తరవాత భర్త మరియు అతడి సోదరుల వేధింపుల కారణంగా అతడితో విడిపోయింది. ఇండస్ట్రీలోకి మొదట టచ్ అప్ ఆర్టిస్ట్ గా సిల్క్ ఎంట్రీ ఇచ్చింది. తనకు మేకప్ అంటే ఎంతో ఇష్టం ఉండటం వల్ల సిల్క్ స్మిత టచ్ అప్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి...ఆ తరవాత సైడ్ డ్యాన్సర్ గా చేసింది. నాలుగో తరగతే చదివినప్పటికీ ఇండస్ట్రీలో ఓ దర్శకుడి సాయంతో ఇంగ్లీష్, డ్యాన్స్ మరియు నటనను సిల్క్ నేర్చుకుంది. 1980 లో వందిచక్కరం సినిమాలో బార్ గర్ల్ పాత్రలో నటించిన స్మిత కు ఈ సినిమాతోనే సిల్క్ గా పేరు వచ్చింది.
ఈ సినిమాలో సిల్క్ పాత్రకు ఎంతో గుర్తింపు రావడంతో ఆ తరవాత కాలంలో ఆ పేరుతోనే పాపులర్ అయ్యింది. రజినీకాంత్ హీరోగా నటించిన ముంద్రు ముగం సినిమాలో సిల్క్ పర్ఫామెన్స్ కు విమర్శకుల ప్రశంసలు అందాయి. ఈ సినిమాతోనే సిల్క్ ఓ అద్భుతమైన నటిగా గుర్తింపు తెచ్చుకుంది. సిల్క్ స్మితకు ఇండస్ట్రీలో అయినా బయట అయినా చాలా తక్కువమంది స్నేహితులు ఉండేవారు. తక్కువ మందితో కలిసేందుకే సిల్క్ కూడా ఇష్టపడేది. సిల్క్ కు షార్ట్ టెంపర్ ఉండేదని అంతే కాకుండా ఏది అనిపిస్తుందో అదే మాట్లాడేదని అమె సహచర నటీనటులు చెబుతుంటారు.