కోలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌లో ఒకరు జ్యోతిక. వెర్సటైల్ యాక్టర్ సూర్యను మ్యారేజ్ చేసుకున్న తర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న జ్యోతిక ఆ తర్వాత మంచి సామాజిక, సందేశాత్మక చిత్రాల్లో నటించి కమ్ బ్యాక్ ఇచ్చేసింది. ప్రస్తుతం ‘ఉడనిరప్పె’ అనే అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ మూవీలో నటిస్తోంది. ఈ సంగతులు ఇలా ఉంచితే.. జ్యోతికకు సంబంధించిన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలు ఎప్పుడూ బయటకు వచ్చేవి కాదు. ఎందుకంటే ఆమె సోషల్ మీడియాలో లేదు.
అయితే, చాలా మంది సెలబ్రిటీలు ఇన్ స్టా గ్రామో లేదా ఫేస్‌బుక్ ద్వారానో ఫ్యాన్స్‌కు తమకు సంబంధించిన అప్‌డేట్స్ ఇస్తుంటారు. అయితే, జ్యోతిక మాత్రం అలా చేయలేదు. సోషల్ మీడియాకు చాలా కాలం పాటు దూరంగానే ఉంది. తాజాగా సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. అది చూసి నెటజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కశ్మీర్ పర్యటన నుంచి కొన్ని ఫొటోస్ పంచుకుని ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చింది. ‘అందరికీ నమస్కారం! మొదటిసారిగా సోషల్ మీడియాలో! నా లాక్‌డౌన్ డైరీల నుంచి కొన్ని ఫొటోలు...స్వాతంత్ర్య దినోత్సవం రోజున హిమాలయాలలో, అందమైన కశ్మీర్ గ్రేట్ లేక్స్, 70 కిమీ ట్రెక్, బికట్ అద్భుతమైన సాహసాల బృందంతో- రాహుల్, సచిన్, రౌల్, అశ్విన్, కాశ్మీర్ జట్టు ముస్తాక్ ఎన్ రియాజ్ భాయ్. మీకు ధన్యవాదములు. !! ఇండియా చాలా అందంగా ఉంది! జై హింద్!’ అంటూ పలు ఫొటోలు షేర్ చేసింది హీరో సూర్య వైఫ్ జ్యోతిక. కాగా, ఆమె పోస్ట్ పెట్టిన రెండు గంటల్లోనే ఆమెకు 1.3 మిలియన్ ఫాలోవర్స్ వచ్చేశారు. ఇకపోతే ఇన్ స్టాలో జ్యోతిక ఎంట్రీ గురించి తెలుసుకుని సినీ లవర్స్, నెటిజన్లు చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు. ఈ క్రమంలోనే ‘వెల్‌కమ్ టు ఇన్ స్టా గ్రామ్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. జ్యోతికను ఇన్ స్టాలో చూసి థ్రిల్ అయ్యానంటూ హీరో సూర్య కామెంట్ చేయడం గమనార్హం.