వైసీపీ ఎంపీ కొడుకు ఎంగేజ్మెంట్ కి హాజరైన చిరు దంపతులు ..!

Divya
ఈ మధ్యకాలంలో మెగాస్టార్ చిరంజీవి ఎక్కువగా వైసీపీ ఎమ్మెల్యేలతో, ఎంపీల తో బాగా కలవడం జరుగుతూనే ఉంది. ఇక అంతే కాకుండా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తో కూడ చిరంజీవి ఈ మధ్య కాలంలో ఎక్కువగానే కలుస్తూ ఉన్నారు. ఇక అలా ఎందుకు కలుస్తున్నాడో అంటే ఏదో ఒక కారణం చెబుతూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఒక వైసీపీ ఎంపీ కొడుకు నిశ్చితార్థం వేడుకల్లో పాల్గొన్నారు చిరు దంపతులు..వారి వివరాలను చూద్దాం.

మెగాస్టార్ చిరంజీవి ఒక వైపు సినిమాల్లో బిజీగా ఉంటూ..ఇటు కొన్ని సేవా కార్యక్రమాలను, మరికొంత మంది వేడుకలలో ఆయన పాల్గొనడం జరుగుతుంది. ఇక ఈ రోజున మచిలీపట్నం వైసీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి కొడుకు అనుదీప్ నిశ్చితార్థం.. నికిత తో జరుగుతూ ఉండగా అందుకు చిరంజీవి దంపతులు పాల్గొనడం జరిగింది.

నిశ్చితార్థ వేడుకలు హైదరాబాదులోని హైటెక్ సిటీలో జరిగిన కార్యక్రమంలో,  చిరంజీవి దంపతులు ఆ వధూవరులను ఆశీర్వదించారు. ఇక ఈ కార్యక్రమంలో ఎంతో మంది వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అలా వీరితో దిగిన కొన్ని ఫోటోలు ఇప్పుడు ఎక్కువగా వైరల్ గా మారుతున్నాయి. ఇక అంతే కాకుండా మరికొంతమంది ఆత్మీయులు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తో కూడా మాట్లాడడం జరిగింది చిరంజీవి.

ఇక అంతే కాకుండా చిరంజీవితో కలిసి అక్కడున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ గుంపు గా ఉండి, ఒక ఫోటో తీయడం జరిగింది. ఇప్పుడు ఈ వేడుకలో చిరంజీవి ఇలా మెరవడం వల్ల, సినీ ఇండస్ట్రీలో అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి. చిరంజీవి త్వరలో పార్టీ మారబోతున్నాడు అన్నట్లుగా సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. కానీ చిరంజీవి ఇదివరకే తిరిగి రాజకీయాల్లోకి ప్రవేశించను అని కూడా చెప్పడం జరిగింది. ఇకపోతే ఆయనకు అప్పుడు రాజకీయాల్లో ఉన్నందువలన అందరు పరిచయం కాబట్టి ,అలా పెళ్లి వేడుకలకు పిలిచి ఉంటారు అని మరికొంతమంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: