అమితాబబ్ కు 50 లక్షలు ఆర్ ఆర్ ఆర్ పరిస్థితి ఏమిటి ?
కరోనా కేసులు దేశవ్యాప్తంగా కొనసాగుతూ ఉన్నప్పటికీ అన్నిరంగాలు నెమ్మదిగా నిలదొక్కుకుంటున్నాయి. ముఖ్యంగా పెళ్ళిళ్ళకు జనం బాగానే వస్తున్నారు. ఇక బార్లు పబ్ లు క్రితంలానే జనంతో కిటకిట లాడుతున్నాయి. హోటల్స్ కు కూడ ఫ్యామిలీలు బాగానే వస్తున్నారు. అయితే ధియేటర్ల విషయంలోనే రివర్స్ గేర్ లో కనిపిస్తోంది.
దక్షిణాదిలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో సినిమా ధియేటర్లకు యూత్ తో పాటు కొంతవరకు ఫ్యామిలీలు వస్తున్నప్పటికీ బాలీవుడ్ లో కేరళాలో తమిళనాడులో కర్ణాటకాలో ఇప్పటికీ ప్రేక్షకులు ధియేటర్ల వంక చూడక పోవడం అత్యంత ఆశ్చర్యంగా మారింది. సౌత్ తో పోల్చితే బాలీవుడ్ సినిమాల పరిస్థితి దారుణంగా ఉంది అన్నవార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం థియేటర్లు కొన్ని చోట్ల ఓపెన్ కావడంతో బాలీవుడ్ కు చెందిన భారీ సినిమాలను విడుదల చేయడం మొదలు పెట్టారు. ఇటీవల బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ‘బెల్ బాటమ్’ సినిమా విడుదల అయ్యింది. ఈమూవీకి టోటల్ పాజిటివ్ టాక్ రావడంతో రెండు మూడు వందల కోట్లు వసూళ్లు చేయగల సత్తా ఉన్న సినిమా అనుకున్నారు. అయితే కనీసం పాతిక కోట్లు కూడా రాబట్టలేక పోయింది అన్న వార్తలు వస్తున్నాయి. ఇక బాలీవుడ్ లో మెగాస్టార్ అమితాబచ్చన్ మూవీ అంటే మినిమం కలక్షన్స్ గ్యారెంటీ.
గత వారం అమితాబచ్చన్ లేటెస్ట్ మూవీ ‘చెహ్రె’ విడుదల అయ్యింది. ఈమూవీకి కూడ చాలామంచి పాజిటివ్ టాక్ వచ్చింది. దేశవ్యాప్తంగా అమితాబ్ కు ఉన్న ఇమేజ్ రీత్యా మొదటి రోజు కలక్షన్స్ 5 నుండి 10 కోట్లు కలక్షన్స్ వస్తూ ఉంటాయి. అయితే ఆసినిమాకు దేశవ్యాప్తంగా 50 లక్షల కలక్షన్స్ రావడంతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ పరిస్థితి ఏమిటి అంటూ చర్చలు మొదలయ్యాయి. ఈ రెండు సినిమాలను ధియేటర్లలో కాకుండా ఓటీటీ లో విడుదల చేసి ఉంటే నిర్మాతలకు కోట్లు కురిసి ఉండేవి. ప్రస్తుతం బాలీవుడ్ లో ఈపరిస్థితి కొనసాగుతూ ఉంటే అమెరికాలో కూడ ధియేటర్ల పరిస్థితి ఏమి బాగాలేదు అని అంటున్నారు. ఈ పరిస్థితులు ఎప్పటికి చక్కబడతాయో ఎవరికీ తెలియని పరిస్థితి. దీనితో బాలీవుడ్ మార్కెట్ ను ఓవర్సీస్ ను నమ్ముకుని నిర్మాణం అయిన ‘ఆర్ ఆర్ ఆర్’ ‘పుష్ప’ ల పరిస్థితి ఏమిటి అంటూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వర్గాలు మధన పడిపోతున్నాయి..