తమిళ సూపర్ స్టార్ విజయ్ తలపతి గురించి ఇటు తమిళ తెలుగు ప్రేక్షకులకు ఆరాధ్య అభిమాన నటుడు. తమిళ్ నుండి వచ్చిన హీరోలలో తెలుగులో మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిలో విజయ్ కూడా ఒకరు. విజయ్ వరుస సినిమాలు చేస్తూ కోలీవుడ్ లో ముందుకు దూసుకుపోతున్నాడు. ఈ సంవత్సరం విజయ్ నుండి వచ్చిన మాస్టర్ సినిమా ఆశించినంత ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఇందులో నటన పరంగా విజయ్ ఆకట్టుకున్నా ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏవరేజ్ గా మిగిలింది. ఈ సినిమా తర్వాత విజయ్ నుండి వస్తున్న సినిమా కోసం ప్రేక్షకులు ఒక రేంజ్ లో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే దిలీప్ నెల్సన్ కుమార్ అనే కొత్త దర్శకుడితో "బీస్ట్" అనే చిత్రాన్ని మన ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నంలో ఉన్నారు.
దర్శకుడు దిలీప్ నెల్సన్ కుమార్ కు పెద్దగా అనుభవం కూడా లేదు. ఇప్పటి వరకు కేవలం రెండు సినిమాలు మాత్రమే డైరెక్ట్ చేశాడు...అందులో ఒక్క సినిమా మాత్రమే రిలీజ్ అయింది. శివ కార్తికేయన్ హీరోగా చేస్తున్న డాక్టర్ మూవీ త్వరలోనే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు విజయ్ తో "బీస్ట్" ను తెరకెక్కిస్తున్నారు. దీనికి నిర్మాతగా సన్ పిక్చర్స్ వారు వ్యవహరిస్తున్నారు. ఇందులో విజయ్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటించనుంది. ఇంతకు ముందు రిలీజ్ చేసిన బీస్ట్ అఫిషియల్ పోస్టర్ కు ప్రేక్షకుల్లో మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా గురించి ఒక గాసిప్ ప్రచారంలో ఉంది.
ఈ సినిమాలో హీరో కు ఫ్రెండ్ పాత్ర చాలా కీలకం కానుంది అని తెలుస్తుంది. అందుకోసం ఆ పాత్రకు విజయ్ సలహా మేరకు ఫ్యామిలీ మ్యాన్ 2 లో నటించిన రవీంద్ర విజయ్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. రవీంద్ర విజయ్ ఒక నటుడిగా తానేంటో నిరూపించుకున్న పనిలో ఉన్నారు. "ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య" లో తన నటనకు మెచ్చి ఫ్యామిలీ మాన్ 2 లో అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడ ఏకంగా తమిళ సూపర్ స్టార్ విజయ్ మూవీలో అవకాశాన్ని కొట్టేశాడు. అది కూడా విజయ్ సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చెయ్యాల్సిందే..