త్యాగానికి ప్రతిరూపం ఈ హీరోయిన్ ..?

Divya
తెలుగు సినిమా కథలో ఒక్కొక్కరు ఒక్కో విధమైన పాత్రలో లీనమై పోతారు అని అనడానికి , నిదర్శనం అలనాటి తారలు అని చెప్పవచ్చు. వీరు సినీ ఇండస్ట్రీలో నటించినంతకాలం కేవలం ఆ పాత్రలకే పరిమితమైపోయి, అదే పాత్రలో నటించాలి అని దర్శకులు వీరిని అదే పాత్రలో నటించేలా చేయడం మొదలు పెట్టారు. ఆ సినిమాలో హీరోయిన్ కనిపిస్తుందని అంటే చాలు కచ్చితంగా ఆ పాత్రలోనే నటిస్తుంది అని ప్రేక్షకులు చెప్పే లాగా ,ఆ పాత్రలకు పరిమితం అవుతుంటారు. ఇక అలాంటి వారిలో ముఖ్యంగా సినిమాల్లో ఎక్కువగా ప్రేమను, పెళ్లిని త్యాగం చేస్తూ వచ్చే హీరోయిన్గా గుర్తింపు పొందింది జయప్రద.

జయప్రద అసలు పేరు లలితారాణి. 1962 ఆగస్టు 3వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,  రాజమండ్రిలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి పేరు కృష్ణ, తల్లి పేరు నీలవేణి. జయప్రద తండ్రి అలాగే పినతండ్రి ఇద్దరూ సినిమా డిస్ట్రిబ్యూటర్లు. ఇక జయప్రద కు  డాక్టర్ అవ్వాలనే కోరిక ఉండేది. కానీ తన తల్లి తనను ఏడు సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు నాట్యం నేర్చుకోవడానికి పంపేదట. అలా తన తల్లి కోసం తను డాక్టర్ అవ్వాలనే కోరికను కూడా త్యాగం చేసుకుంది జయప్రద. ఇక వీళ్ళ నాన్న వాళ్లు సినీ ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ వీరి ద్వారా ఈమెకు అవకాశాలు లభించలేదు.
తన 14 సంవత్సరాల వయసులో నాట్య ప్రదర్శన ఇస్తున్నపుడు ప్రభాకర్ రెడ్డి ఈమెను చూసి 1976 వ సంవత్సరంలో భూమికోసం అని సినిమాలోని ఒక పాటలో మూడు నిమిషాల పాత్రను ఈమెకు ఇవ్వడం జరిగింది. అలా ఈమె సినీ ప్రస్థానం మొదలైంది. 30 సంవత్సరాల లో , ఆరు భాషలలో 300కు పైగా చిత్రాల్లో నటించి మెప్పించింది. నందమూరి తారక రామారావు సీఎం గా ఉన్న హయాంలో రాజకీయాల్లోకి కూడా చేరి మహిళా అధ్యక్షురాలిగా కూడా పనిచేసింది. ఇక అలా  అటు సినీ రంగంలోనూ , ఇటు రాజకీయ రంగంలోనూ తనకంటూ ఒక ప్రత్యేకమైన అభిమానాన్ని ఏర్పాటు చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: