పాన్ ఇండియా సూపర్ స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.బాహుబలి సిరీస్ తో దేశవ్యాప్తంగా నలుమూలాల అభిమానులని ఎనలేని క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు.దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా పెద్ద పాన్ ఇండియా ఇండస్ట్రీ హిట్ ని అందుకొని ప్రభాస్ కి ఏ హీరో కూడా సాధించలేని రికార్డులని సొంతం చేసింది.ఇక దాని తరువాత వచ్చిన సాహో సినిమాతో కూడా నార్త్ లో బిగ్గెస్ట్ సూపర్ హిట్ ని అందుకొని హిందీ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు ప్రభాస్.ఆ సినిమా తెలుగులో అట్టర్ ప్లాప్ అయినా కానీ బాలీవుడ్ లో మాత్రం సూపర్ హిట్ అందుకుంది. ప్రభాస్ ని బాలీవుడ్ లోనూ స్టార్ గా నిలబెట్టింది. ఇక అప్పట్నుంచి ప్రభాస్ ని కూడా నార్త్ ఆడియన్స్ వాళ్ళ హీరోలతో సమానంగా ట్రీట్ చెయ్యడం జరిగింది.ఇక అప్పుడు నుంచి ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ ఫుల్ బిజీ అయ్యాడు.
ఇక ప్రభాస్ కి సోషల్ మీడియాలో కూడా విపరీతంగా ఫాలోయర్స్ పెరిగారు. ముఖ్యంగా ఫేస్ బుక్ లో ప్రభాస్ కి ఈమధ్య విపరీతంగా ఫాలోయర్స్ పెరిగారు.అలాగే ఫాలోయర్స్ తో పాటు ప్రభాస్ కి హేటర్స్ కూడా పెరిగారు. ఇక స్టార్ హీరోలకి ఫ్యాన్స్ తో పాటు హేటర్స్ కూడా ఉండటం అనేది సాధారణ విషయమే. ఇక ప్రభాస్ కి కూడా హేటర్స్ పెరిగారు. వేరే హీరోస్ ఫ్యాన్స్ కూడా ప్రభాస్ ని ట్రోల్ చేస్తున్నారు. ఇక ఈ క్రమంలో ప్రభాస్ లుక్ పై కూడా మీమ్స్ వస్తున్నాయి. తాజాగా ఫేస్ బుక్ లో ఓ పేజీ వారు ప్రభాస్ ముసలివాడిలా వున్నాడంటూ మీమ్ చేశారు. ప్రస్తుతం ఆ మీమ్ తెగ వైరల్ అవుతుంది. ఇక ఆ మీమ్ చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ కోపంతో రగిలిపోతున్నారు. ఆ పేజీ పై విరుచుకుపడుతున్నారు.ఇక ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యాం సినిమాతో విడుదలకు సిద్ధంగా వున్నాడు. ఇక ఆ సినిమాతో పాటు ఆదిపురుష్, సలార్, నాగ్ అశ్విన్ సినిమాలు కూడా చేస్తూ ఫుల్ బిజీగా వున్నాడు.