
పెళ్లి కూతురు గెటప్‌లో ప్రముఖ హీరోయిన్..?
సదరు వీడియోలో తెల్ల చీరలో నయనతారతో పాటు సమంత అక్కినేని ఉన్నారు. ఇక నయన్ వెనకాలే వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి ఉన్నాడు. ఆర్టీసీ బస్సు ఫుట్ బోర్డులో వీరు ప్రయాణం చేస్తూ కనిపిస్తున్నారు. ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా ‘కాతు వాకుల రెండు కాదల్’ సినిమా వస్తుండగా, ఇందులో విజయ్ సేతుపతి చివరికి ఎవరిని పెళ్లి చేసుకుంటాడో మరి.. ఈ ఫిల్మ్‌ను 7 స్క్రీన్ స్టూడియో,రౌడీ పిక్చర్స్ బ్యానర్‌పై లలిత కుమార్ నిర్మిస్తున్నారు.ఇక ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. నయనతార ఈ చిత్రంతో పాటు సూపర్ స్టార్ రజనీ ‘అన్నాత్తే’, జీఎస్ విక్నేష్ దర్శకత్వంలో వస్తున్న ఓ చిత్రంలో నటిస్తోంది. సామ్..
ఈ చిత్రంతో పాటు పాన్ ఇండియా ఫిల్మ్ ‘శాకుంతలం’లో నటిస్తోంది. ఇది ఆమెకు తొలి హిస్టారికల్ క్యారెక్టర్ కాగా, ఈ ఉమన్ సెంట్రిక్ ఫిల్మ్‌ను గుణశేఖర్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రంపైన భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి.
విజయ్ సేతుపతి ఈ చిత్రంతో పాటు దాదాపు పది సినిమాల్లో నటిస్తున్నారు. ‘ముంబైకర్’ చిత్రంతో విజయ్ సేతుపతి బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ‘ఖైదీ, మాస్టర్’ ఫేమ్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ డైరెక్షన్‌లో కమల్ హాసన్ హీరోగా వస్తున్న ‘విక్రమ్’ ఫిల్మ్‌లో కీ రోల్ ప్లే చేస్తున్నాడు.