చిరు, నాగ్ లా వెంకీ ఎందుకు చేయలేకపోతున్నాడు!!
అలా వెంకటేష్ అందరి హీరోలతో మంచి ర్యపో పెంచుకుని వారితో కలిసి మెలిసి ఉంటాడు. ఇప్పటివరకు టాలీవుడ్ లో ఎక్కువ మల్టీ స్టారర్ సినిమాలు చేసిన హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక్క వెంకటేష్ అనే చెప్పాలి. ఇక వెంకటేష్ రీమేక్ సినిమాలు చేయడంలో కూడా అందరికంటే ముందు ఉన్నాడు.. అయన హీరోగా చాలా రీమేక్ సినిమాలు చేసి హిట్ లు సంపాదించాడు. ఇటీవలే నారప్ప సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇది తమిళ సినిమా కి రీమేక్ కాగా దాంతో నూ భారీ హిట్ సంపాదించాడు.. ప్రస్తుతం దృశ్యం రెండో పార్ట్ సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే విధంగా సన్నాహాలు చేస్తున్నాడు.
అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వంలో f3 సినిమా సీక్వెల్ ని కూడా చేస్తున్నాడు వెంకీ.. ఫ్యామిలీ కథా చిత్రం గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే వెండితెరపై ప్రేక్షకులను ఎంతగానో అలరించే వెంకటేష్ బుల్లితెరపై మాత్రం పెద్దగా అలరించాలేకపోయాడు. తోటి సీనియర్ హీరోలు చిరంజీవి, నాగార్జున లు బుల్లితెరపై కొన్ని షో లలో పాల్గొని వ్యాఖ్యాతలుగా చేయగా వెంకటేష్ మాత్రం బుల్లితెర అంటే ఇష్టం లేదన్నట్లుగా వ్యవహరించారు. దానికి కారణం అయితే తెలీదు కానీ వెంకటేష్ బుల్లితెరపై చూడాలనే కోరిక చాలామంది లో ఉంది. మరి ఇప్పటికైనా వెంకటేష్ అభిమానుల బుల్లితెర కోరిక ను నేరవేరుస్తారా చూడాలి.