
ఆ సినిమాతో రవితేజ సక్సెస్ అవుతాడా ..?
సాధారణంగా రమేష్ వర్మ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు అంటే, అందులో హీరో ని చాలా విభిన్నంగా చూపిస్తాడు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇక అందుకు తగ్గట్టుగానే ఆయన ఇందులో రవితేజను డ్యుయల్ పాత్రలో కనిపించేలా చేస్తున్నట్లు సమాచారం. ఇక క్రాక్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు కాబట్టి ఈ సినిమాపై కూడా పూర్తి నమ్మకాన్ని పెట్టుకున్నాడు. బెల్లంకొండ సురేష్ తో వచ్చిన రాక్షసుడు సినిమా తో మంచి విజయాన్ని అందుకున్న రమేష్ వర్మ, రవితేజతో కలిసి మరొక హిట్ ను తన ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.
ఇకపోతే రమేష్ వర్మ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రవితేజ తన సినీ కెరీర్ లోనే అత్యంత ఎక్కువ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాము అని తెలిపారు .. సాధారణంగా రవితేజ సినీ కెరియర్ లో 60 కోట్ల కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఉన్నాయి కానీ, అంతకంటే ఎక్కువ బడ్జెట్ తో తెరకెక్కించిన సినిమాలు మాత్రం ఏ ఒక్కటి కూడా లేవు. అందుకే ఈ సినిమాను ఏకంగా 65 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాము అని, రమేష్ వర్మ ఇంటర్వ్యూ లో తెలపడంతో ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు ఈ సినిమాతో ఎలాగైనా సరే రెట్టింపు స్థాయిలో షేర్ ను రాబడతాము అంటూ ఆయన స్పష్టం చేయడంతో, ఈ సినిమా కచ్చితంగా హిట్ ను సాధిస్తుంది అని కొంతమంది అభిప్రాయపడుతుంటే , డ్యుయల్ పాత్రలో చేస్తున్న రవితేజ ఎలా మెప్పిస్తాడో అంటూ మరికొంతమంది తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఏది ఏమైనా సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే.