హాసిని కోసం 'బొమ్మరిల్లు' భాస్కర్ అన్ని కష్టాలు పడ్డాడా..?

Anilkumar
ఆ సినిమా వచ్చి దాదాపు 15 ఏళ్ళు కావస్తోంది.అయినా ఇప్పటికీ ఆ సినిమాని ప్రేక్షకులు మర్చిపోలేదు. ముఖ్యంగా అందులో ఓ మూడు పాత్రలు మాత్రం అందరి మనసులో ఉండిపోయాయి.ఆ సినిమానే 'బొమ్మరిల్లు'.ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, జెనీలియా,సిద్ధార్థ ఈ ముగ్గురి చుట్టూనే సినిమా అంతా ఉంటుంది. అందులో జెనీలియా పాత్ర చిత్రణ అయితే ఆడియన్స్ ని తెగ ఆకట్టుకుంది.అయితే ఆ పాత్ర ఎలా పుట్టిందో.. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..'ఆర్య' సినిమాకు పని చేస్తున్నప్పుడే ఈ సినిమా హిట్ అయితే డైరెక్షన్ ఛాన్స్ ఇస్తానని బొమ్మరిల్లు భాస్కర్ కి దిల్ రాజు మాటిచ్చాడట.


అయితే అనుకున్నట్లే ఆ సినిమా హిట్ అయ్యింది.అప్పుడు దిల్ రాజు కథ రెడీ చేసుకో అని భాస్కర్ కి చెప్పాడట.అలా రెండు కథలు దిల్ రాజుకు చెబితే..ఇవన్నీ వద్దు మంచి ఫ్యామిలీ మూవీ చేద్దాం అని అన్నారట.అప్పుడు కొన్ని నిజ జీవిత సంఘటనలను బేస్ చేసుకొని 'బొమ్మరిల్లు' కథను చెప్పాడట భాస్కర్.అయితే ఈ కథలో హీరోయిన్ పాత్ర గురించి ఇంకా వర్క్ చేస్తే బాగుంటుందని సూచించారట.దీంతో ఓ పదిహేను రోజులు సమయం ఆడిగాడట భాస్కర్.దానికి దిల్ రాజు ఓకే అనడంతో...భాస్కర్, వాసు వర్మ కలిసి హీరోయిన్ పాత్ర గురించి కుస్తీలు పడ్డారట.దాదాపు 14 రోజులైనా మంచి పాయింట్ తట్టలేదట.
దీంతో భాస్కర్ కి బాగా చిరాకు వచ్చేసిందట.


అయితే 15 వ రోజు తెల్లరిజామున 4 గంటలకు వాసు వర్మ తో డిస్కస్ చేస్తూ ఆయన జీవితంలో జరిగిన ఓ సంఘటన చెప్పారట భాస్కర్.అదే ఓ అమ్మాయి తలను అనుకోకుండా తలను గుద్దితే.. కొమ్ములొస్తాయని మళ్ళీ గుద్దడం..ఇక ఆ పాయింట్ ని పట్టుకొని కేవలం రెండు గంటల్లో హాసిని పాత్రను మొత్తం రాసేసాడట.అలా హాసిని పాత్ర ని దర్శకుడు భాస్కర్ తన నిజ జీవితంలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా రాసుకుంటే.. ఆ పాత్రకి జెనీలియా వంద శాతం న్యాయం చేసిందని చెప్పొచ్చు.ఇక ఈ విషయాన్ని దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు.ఇక ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్.. అక్కినేని అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాని తెరకెక్కించాడు.త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: