సుడిగాలి సుధీర్ కి మూడు పెళ్లిళ్లు.. అసలు విషయం లీక్ చేసిన గెటప్ శీను?

praveen
సుడిగాలి సుదీర్..  ఈ పేరుకి బుల్లి తెరపై ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు  జబర్దస్త్ లో ఒక సాదా సీదా కమెడియన్ గా తన కెరియర్ ప్రారంభించిన సుడిగాలి సుదీర్ ప్రస్తుతం బుల్లితెర సూపర్ స్టార్ గా మారిపోయాడు అని చెప్పాలి.  ఓవైపు తనదైన శైలిలో కామెడీ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాదు మరోవైపు జబర్దస్త్ యాంకర్ రష్మీ తో ప్రేమాయణం నడుపుతున్నట్లు బుల్లితెర ప్రేక్షకులు చూపులు తన వైపుకు తిప్పుకున్నాడు. ప్రస్తుతం సుడిగాలి సుదీర్ బుల్లితెరపై ఎక్కడ కనిపించినా ఇక ప్రేక్షకులు అందరూ మురిసిపోతారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం కమెడియన్గా మాత్రమే కాకుండా అటు యాంకర్గా కూడా తన సత్తా చాటుతున్నాడు.

 శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కార్యక్రమంలో తనదైన వాక్చాతుర్యంతో యాంకరింగ్ చేస్తూ అదరగొడుతున్నాడు సుడిగాలి సుదీర్. ఇక శ్రీదేవి డ్రామా కంపెనీ లో ఎప్పుడు వినూత్నమైన కాన్సెప్టుతో తెర మీదికి వస్తూ అటు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటారు. వచ్చే ఆదివారం రాఖీ పౌర్ణమి రోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కూడా కావడంతో ఇక ఈ ఈవెంట్ ని ఎంతో స్పెషల్ గా ప్లాన్ చేశారు నిర్వాహకులు. ఈ క్రమంలోనే జబర్దస్త్ సినీ సెలబ్రిటీల కు సంబంధించిన అక్క చెల్లెలను కూడా పిలిచారు. వారితో రాఖీ కట్టించారు. అయితే ఇటీవల కాలంలో ఏ కార్యక్రమం లో చూసిన  సుడిగాలి సుధీర్ పెళ్లి కి సంబంధించిన అంశం హాట్ టాపిక్ గా మారిపోతుంది.

 శ్రీదేవి డ్రామా కంపెనీ లో కూడా సుడిగాలి సుధీర్ పెళ్లి మ్యాటర్ తెరమీదికి వచ్చింది. ఇక ఇటీవల విడుదలైన ప్రోమో లో భాగంగా సుడిగాలి సుధీర్ కోసం ఏకంగా వాళ్ళ అక్క ఎంట్రీ ఇస్తుంది. మా ఇద్దరికి ఒక సంవత్సరమే గ్యాప్  ఇద్దరిని బ్రదర్ అండ్ సిస్టర్ అనడం కంటే మంచి స్నేహితులం అనాలి.. అన్ని షేర్ చేసుకుంటాము అని చెబుతోంది. వెంటనే అందుకున్న గెటప్ శ్రీను ఇప్పుడు షేర్ చేసుకోవడం లేదు కదా.. ఇప్పుడు మాతో షేర్ చేసుకుంటున్నాడు. చాలా సీక్రెట్స్ ఉన్నాయి అంటూ పంచ్ వేస్తాడు. ఇక అంతలోనే రాంప్రసాద్ అందుకుని.. వీడి పెళ్లి కోసం అక్క ఇప్పటికి మూడు సార్లు కెనడా నుంచి వచ్చింది పాపం ఫ్లైట్ చార్జీలు బొక్క.. ఆ డబ్బులతో వీడికి ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసేవాళ్లం అంటూ పంచ్ వేస్తాడు. దీంతో అక్కడున్న వారందరూ నవ్వుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: