ఈ హీరోయిన్ లో ఉన్న వీక్నెస్ పాయింట్లు ఇవే..?

Divya
టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్ లలో స్టార్ హీరోయిన్ రేంజ్ లో మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ కూడా ఒకరు. కానీ ఈమె ఈ మధ్య కాలంలో వరుస ఫ్లాప్ లను చవిచూస్తోంది. ఇక ఈమెకు కొన్ని అలవాట్లు ఉన్నాయట అవి ఏమిటో చూద్దాం.
మొదటిసారిగా ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అనుపమా.. ఆ తర్వాత ఆ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది. ఇక దిల్ రాజు నిర్మించిన 2017 వ సంవత్సరంలో శతమానంభవతి సినిమాలో హీరోయిన్ గా నటించింది ఈమే. ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా ఎన్నో సినిమాలలో నటించిన అనుపమ , ఆ తరువాత ఎన్నో సినిమాలను నటించడానికి ఒప్పుకొంది. అంతేకాకుండా ధనుష్ తో కలిసి తమిళంలో కూడా"కోడి"అనే సినిమాలో అలరించింది.
ఈమె ఇక మలయాళం లో కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలో  చేస్తూ చాలా బిజీగా ఉంది. ఇక అంతే కాకుండా దుల్కర్ సల్మాన్ తో తెలుగులో అందమైన జీవితం అనే పేరుతో కూడా సినిమాను విడుదల చేశారు. హీరో రామ్ తో కలిసి రెండు సినిమాలు చేసిన ఒకటి ఆవరేజ్ గా నిలిచింది, మరొకటి పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
అనుపమ ఎప్పుడు ఒకే రకంగానే ప్రతి సినిమాలలో కనిపించడం వల్ల , ఆమెను కొంతమంది సినిమాలలో నటించడానికి ఒప్పుకోలేదు అనే విధంగా సినీ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఈమె ఎప్పుడు ఫ్యామిలీ మూవీ లను మాత్రమే ఓకే చెప్పడం వల్ల అతికొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్ ల లిస్ట్ లో నిలవలేకపోయింది. ఇక ప్రస్తుతానికి ఈమె నిఖిల్ తో ఒక సినిమా చేస్తోంది. ఆ సినిమా హిట్ అయితేనే మళ్లీ ట్రాక్ లోకి వస్తానన్నట్లు వినిపిస్తోంది.
ఇక ఈమె ఎంచుకునే కథలు సరిగా లేకపోవడం వల్లే అనుపమ సినీ ఇండస్ట్రీకి దూరం కావాల్సి వచ్చింది. ముఖ్యంగా ఫ్యామిలీ సినిమాలను ఎంచుకోవడమే ఈమె లో ఉన్న మైనస్ పాయింట్ అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: