అలా చేస్తోన్న కమల్ కూతురు.. ఎందుకంటే..?
సినిమా రంగంలోకి అరంగేట్రం చేశాక శృతి హాసన్ తన తండ్రి పేరును ఎక్కువగా ఉపయోగించుకోలేదు. ఆమె నటనతోనే ప్రేక్షకులకు దగ్గరైంది. తన అందంతో కుర్రకారు మదిలో స్థానం పొందింది. ఇకపోతే ఈమె కెరీర్ విషయానికి వస్తే మొదట్లో ఈమెకు హీరోయిన్ అవ్వాలని ఉండేది కాదట. మొదట ఈమె మ్యూజిక్ బాండ్ ను పెట్టాలనుకుంది. అయితే ఆమెకు డబ్బులు లేవు. ఆ డబ్బులను సంపాదించడం కోసం ఆమె హీరోయిన్ అయ్యింది. ఆ తర్వాత సినిమాలు తీయడాన్ని ఇష్టంగా మార్చుకుంది. ఒక ఛాలెంజ్ తోటి సినిమాలు చేయడం మొదలు పెట్టింది. మొదట్లో డబ్బులు వచ్చాక సినిమాలు ఆపేద్దామని అనుకున్నప్పటికీ సినిమాల మీద ఇష్టంతో దానిని కొనసాగించాల్సి వచ్చింది. ఈ మధ్యనే ఓ చిట్ చాట్ కార్యక్రమంలో శృతి హాసన్ ఈ విషయాలను చెప్పుకొచ్చింది. అయితే శృతి హాసన్ కు రాక్ స్టార్ అవ్వాలని ఆశ మాత్రం ఇంకా ఉందని, దాని కోసం త్వరలోనే మ్యూజిక్ బాండ్ ను ఏర్పాటు చేస్తానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం శృతి హాసన్ ప్రభాస్ కు జతకట్టింది. సలార్ సినిమాలో నటిస్తోంది.