ఆ సినిమా కోసం రెండు కిలోమీటర్లు రైల్వే ట్రాక్ పై నడిచిన ఆలీ..!

VUYYURU SUBHASH
ఆలీ.. అటు సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో మంచి కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా, హీరోగా కూడా కొన్ని సినిమాలలో చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు ఆలీ. హీరోగానే  కాదు ఈయన బుల్లితెరపై కూడా నటిస్తూ తనదైన శైలిలో అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. ముఖ్యంగా ఈ టీవీ లో ప్రతి వారం ప్రసారమయ్యే ఆలీతో సరదాగా షోలో ఎంతో మంది ప్రముఖులను ఆహ్వానించి, వారి వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటుంటారు. ఇక రెండు చేతల బాగానే సంపాదిస్తూ ఒక మంచి స్టార్ కమెడియన్ గా  కూడా గుర్తింపు పొందిన వ్యక్తి ఆలీ.
ఒక సినిమా కోసం ఏకంగా రెండు కిలోమీటర్ల పాటు రైల్వే ట్రాక్ పైన లగేజీని పట్టుకుని నడిచారు. అందుకు గల కారణం కూడా ఆలీయే స్వ‌యంగా చెప్పాడు.  చెన్నై లో  తాను పడిన కష్టాలతో పోల్చుకుంటే  హైదరాబాదు లో పడిన కష్టాలు అసలు కష్టాలే కావు. చెన్నైలో కష్ట పడితే తప్పకుండా స్టార్ అవుతారు  అని చెప్పేవాళ్ళు.. అందుకే నేను 6 నెలలపాటు కేవలం టీ, బన్ తోనే జీవితం గడిపాన‌ని చెప్పారు. డబ్బులు లేక ఎవరిని కూడా నేను ఏమి అడిగే వాడిని కాదు. నాకు చాలా మొహమాటం కూడా ఎక్కువే. ఒక వేళ అడిగితే  వీడు అప్పుడే డబ్బులు అడుగుతున్నాడు అంటూ కామెంట్ కూడా చేసే వాళ్ళు అని వాపోయాడు.
దానికి భయపడి ఆలీ ఎవరి దగ్గర రూపాయి కూడా తీసుకోలేద‌ట‌. ఒకవేళ ఇంట్లో అడిగితే , ఇచ్చే వాళ్ళు.. కానీ నాకు అలా అడగడం ఇష్టంలేక, ఎవర్ని ఒక రూపాయి కూడా అడిగి తీసుకునే వాడు కాద‌ట‌..!  ఒకసారి ప్రేమఖైదీ సినిమాలో ఓ క్యారెక్ట‌ర్‌కు ఆలీ ఎంపికయ్యాడ‌ట‌. దీని గురించి ఆలీ చెపుతూ అప్పటికి తాను ఇంకా మద్రాస్ లోనే ఉన్నాను. హైదరాబాద్ కు బయలుదేరాలని చెప్పారు. అలా మూడు సార్లు బయలుదేరమని చెప్పి, తీరా వెళ్లేటప్పుడు క్యాన్సిల్ అని చెప్పేవారు. అర్జెంటుగా మా రూం కి ఒక వ్యక్తి వచ్చి వెంటనే బయలుదేరమని చెప్పేవార‌ని ఆలీ చెప్పాడు.
చివ‌ర‌కు ఆలీ వ‌చ్చేస‌రికే త‌న‌ రూమ్లో వాళ్లంతా నేను వచ్చేసరికి వెళ్లిపోయార‌ట‌. ఎలాగైనా సరే హైద‌రాబాద్‌కు వెళ్లాలని ఆలీ సొంత డబ్బులతో చార్మినార్ ఎక్స్ప్రెస్ రైలు ఎక్కాడ‌ట‌.  కొంత సేపట్లో హైదరాబాద్ కు  చేరుకోవాలి..కానీ  రైలు ఆగిపోయింది.ఒక పక్క  షూటింగ్ .. నేను వెళ్ళకపోతే త‌న‌ను తీసేస్తారేమో అన్న భయంతో రెండు కిలోమీటర్ల పాటు పెట్టె పట్టుకొని నడిచాను అంటూ చెప్పుకొచ్చాడు ఆలీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: