సింగర్ సునీత ప్రేమ వెనుక ఉన్న రహస్యం ఇదే..?

Divya
టాలీవుడ్ లో సింగర్ సునీత ఎన్నో పాటలు పాడి ప్రేక్షకుల మనసులను దోచుకుంది. అంతే కాకుండా ఈ మధ్య కాలంలోనే ఈమె ఒక వ్యాపారవేత్త అయిన రామ్ వీరపనేని ని పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే తనను ఎలా పెళ్లి చేసుకుందో..? తానే ఒక ఇంటర్వ్యూ ద్వారా తెలిపింది. అయితే ఆ విషయాలను ఇప్పుడు ఒకసారి చూద్దాం.
ఇక వీరిద్దరూ పెళ్లి చేసుకున్న తర్వాత ఎంతో  అన్యోన్యంగా వుంటున్న విషయం తెలిసిందే. ఇక అంతే కాకుండా తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను కూడా ఇప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది సునీత. అయితే తాజాగా తన భర్త రామ్ వీరపనేని ఎలా ప్రపోజ్ చేశాడో తెలియజేసింది."అందరిలాగా కాకుండా తను కొంచెం వెరైటీ డైలాగ్స్ చెప్పారని తెలిపింది".
ఇక ఒకరోజు మాట్లాడుతూ ఉన్నప్పుడు..సడన్ గా రామ్ వీరపనేని ప్రపోజ్ చేశాడని తెలిపింది."నువ్వంటే నాకు చాలా ఇష్టం.. నువ్వు నా ప్రపోజ్ ని అంగీకరిస్తే.. నా అంత అదృష్టవంతుడు ఎవరు లేరు. నువ్వు నా లవ్ ప్రపోజల్ ఒప్పుకోకపోతే.. కొంచెం ఫీల్ అవుతానేమో.. కానీ నా జీవితంలోకీ నువ్వు రావాలి..నేను  ముందుకు పోవడానికి నువ్వు  తోడుగా రావాలనే కోరిక ఉంది" అని తెలిపారట.

దీంతో సింగర్ సునీత ఆయన మాటలకు పడిపోయి పెళ్ళికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈమె  చెప్పిన మాటలు చాలా వైరల్ గా మారడం వల్ల సింగర్ సునీత పెళ్లి వెనుక ఇంత  కథ జరిగిందా అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక అంతే కాకుండా ఈ మధ్యకాలంలో సింగర్ సునీత కొంతమంది నిజస్వరూపాలు కూడా తెలియజేస్తూ ఉంది. సినీ ఇండస్ట్రీలో ఒంటరిగా ఉండడం అంటే చాలా కష్టం. ఒక తోడు లేకుండా ఉండాలంటే, చాలా ఇబ్బందులకు గురవుతూ రావాల్సి ఉంటుంది అని సింగర్ సునీత తెలిపింది. ఒక ఇప్పుడైనా తన జీవితం సంతోషంగా సాగాలని మనం కోరుకుందాం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: