రేపు మహేష్ ఫ్యాన్స్ కి ఆ సూపర్ ట్రీట్ ఉందా ..... ??

Suma Kallamadi
రేపు అంటే ఆగస్టు 9న సోమవారం నాడు ప్రిన్స్ మహేష్ బాబు తన 46వ పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఇప్పటికే అభిమానులు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే సెలబ్రేషన్స్ మొదలు పెట్టారు. ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్లో భారీ హంగామా చేస్తూ సందడి వాతావరణాన్ని నెలకొల్పుతున్నారు. అభిమానులు తమ ఫేవరెట్ హీరో మహేష్ జన్మదినాన్ని అద్భుతంగా సెలబ్రేట్ చేసేందుకు పక్క ప్లాన్ ప్రకారం ఉన్నారు.

ఈరోజు అర్ధరాత్రి సరిగ్గా 12 AM సమయానికి అప్‌కమింగ్ ఫిల్మ్ `సర్కారు వారి పాట` నుంచి స్పెషల్ బర్త్ డే పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు. పుట్టినరోజు ఉదయం పూట 9 గంటలకు మహేష్ బర్త్ డే బ్లాస్టర్ టీజర్ ను ఆవిష్కరిస్తారు. ఇక ఇదే రోజున మహేష్ బాబు, త్రివిక్రమ్ అప్‌కమింగ్ మూవీకి సంబంధించిన అదిరిపోయే అప్ డేట్ రానుంది. దీంతో రేపు అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంటుందని నిస్సందేహం గా చెప్పవచ్చు.

పుట్టిన రోజు సందర్భంగా మహేష్ బాబు మూవీ నుంచి మరిన్ని ఆసక్తికరమైన అప్ డేట్స్ వస్తాయని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మహేష్ పరశురామ్ తో ఒక సినిమా చేస్తున్నారు.  తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి ఓ సినిమా ప్రారంభిస్తారు. వీరిద్దరి కాంబోలో ముచ్చటగా మూడోసారి వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఈ సినిమా తర్వాత మహేష్ ఏ అగ్ర దర్శకుడితో కలిసి సినిమా చేస్తారనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా రాజమౌళితో మహేష్ సినిమా చేస్తారా లేదా అనే విషయంపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎప్పట్నుంచే వేచి చూస్తున్నారు. ఈసారి మహేష్ బర్త్ డే సందర్భంగా రాజమౌళి మూవీ గురించి అప్డేట్ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ కాంబోను మహేష్ లేదా రాజమౌళి అప్డేట్ ప్రకటిస్తేనే కిక్ వస్తుందని అభిమానులు అనుకుంటున్నారు.

ఇకపోతే మొన్నీమధ్య సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన యువ హీరోలు సైతం భారీ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. మహేష్ మాత్రం ఇంతవరకూ పాన్ ఇండియా మూవీ ప్రకటించలేదు. మొట్టమొదటి పాన్ ఇండియా మూవీ రాజమౌళితో ప్లాన్ చేస్తే.. ఇక మహేష్ గ్లోబల్ స్టార్ కావడం ఖాయం. మరి రేపు మహేష్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చే అప్ డేట్ విడుదల కానుందా.. ? అనే ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: