ఆ సినిమా షూటింగ్ లో సమంత ఏం చేసిందో చూడండి..??

N.ANJI
తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న వారిలో సమంత ఒక్కరు. ఆమె అక్కినేని వారింట కోడలుగా అడుగుపెట్టిన సమంత అక్కినేని అనే బ్రాండ్‌తో మరింత పాపులారిటి పెమొచుకుని తనదైన స్టైల్ రాణిస్తుంది. ఆమె ఒక్క సినిమాలతోనే ఆగిపోకుండా వ్యాపారాలు, ఫ్యాషన్ ఇలా అన్నింటా నేనే నెం.1 అంటూ ముందన్నట్లుగా హవా కొనసాగిస్తుంది సమంత. అంతేకాదు.. కొంత విరామం దొరికిన చాలు భర్త నాగచైతన్యతో సంతోషంగా గడుపుతూ అందుకు సంబంధించిన పోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంటుంది.


ఇక సమంత ప్రస్తుతం కథానాయిక ప్రాధాన్యత ఉన్న సినిమాల్లోనే నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ తరుణంలో ఇప్పుడు గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే చిత్రంలో నటిస్తుంది సమంత. కాగా.. తాజాగా ఈ ముద్దుగుమ్మ శాకుంతలం సినిమా నుంచి ఒక ఫొటో సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఇక ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఆమె షేర్ చేసిన ఫొటో ప్రస్తుతం వైరల్ అవుతుంది.
అయితే ఈ ఫొటోలో మేకప్ ఆర్టిస్ట్ సాధన సింగ్ సమంతకు మేకప్ వేస్తూ కనిపించారు. అంతేకాక.. ఈ ఫొటోలో సమంత గ్రీన్ కుర్తా ధరించి చాలా అందంగా కనిపిస్తుంది. కాగా.. సమంత అక్కినేని నటిస్తున్న శాకుంతలం సినిమాలో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ ప్రిన్స్ భారత పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

 

కాగా.. సమంత ఇప్పుడు అలా క్యారవ్యాన్‌లో చేసిన ఈ అల్లరి పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా.. సమంత ఓ కొత్త యాప్‌ను వాడేసి ఆమె మేకప్ మెన్ అయిన సాధన సింగ్ శరీర భాగాన్ని పెంచుతున్నారు. అయితే సాధన సింగ్ సమంతకు మేకప్ వేస్తున్న క్రమంలో ఆమె నడుము భాగం కాస్త ముందుకు వచ్చినట్టు కనిపించి.. నా పొట్ట భాగాన్ని లోపలకి పంపించే యాప్ ఏదైనా ఉందా? అన్నట్లు సమంతని అడుగుతుంది ఆమె. ఇక దానికి సమంత పొట్ట లోపలకి పోవాల్సింది పోయి.. బయటకు వచ్చేలా చేశారు.. అనే పిక్స్ పోస్ట్ చేశారు. అయితే ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: