ప్యాన్ ఇండియా బిగ్ జోక్ !
సినిమాకు సినిమాకు మధ్య
ఓ జోక్ వస్తుంది
మన కథ కాపీ అని
సినిమాకు సినిమాకు మధ్య
ఓ బ్రేక్ వస్తుంది
కథను మారుస్తున్నామని
జెనరేషన్ ఇప్పుడు పాన్ ఇండియా అంటుంది
ఇది కూడా జోక్ సినిమాకు సినిమా మధ్య
హీరోకూ హీరోకూ మధ్య నవ్వుకోండెహే
కేజీఎఫ్ లాంటి మంచి సినిమాకు ప్యాన్ ఇండియా ఫిల్మ్ అనే ట్యాగ్ ఇవ్వండి..ఒప్పుకుంటాం.సినిమాలో ఆ సత్తా ఉంది కనుక అది సాధ్యం..సాహో లాంటి చెత్త సినిమాలకూ ప్యాన్ ఇండియా స్కోప్ ఎందుకు? కనీసం ఆలోచించకుండా ఒక సినిమా ఏ ప్రాంతానికి పరిమితం చేస్తే సరిపోతుందో అన్నది ఫిల్మ్ మేకర్స్ కు అర్థం కాకుండానే దేశ వ్యాప్త విడుదల అని, ప్రపంచ వ్యాప్త సినిమా అని హ డావుడి చేస్తున్నారా?
ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్.. కానీ పుష్ప కానీ మరొకటి కానీ బహుభాషా సినిమాలకు ప్యాన్ ఇండియా అని పేరు మార్చి అమ్ముతు న్నారా లేకా ఆ కథలకు ఆ అప్పీల్ ఉందా? మనం ఒక్కటి గుర్తు చేసుకోవాలి ఊరకనే బాలీ వుడ్ మనల్ని ట్రోల్ చేయదు.మన సత్తా లేకుండా వాళ్లను అనడం తప్పు.ఇప్పటికే దోస్తీ సాంగ్ లో సత్తా లేదని తేలిపోయింది. కనుక వాళ్లు వీళ్లూ ట్రోల్ చేస్తున్నారు.అలానే రేపటి వేళ కథలో సత్తా లేకుండా ఇదీ మా కష్టం ఇది మా అప్పు ఇది మా ఆస్తి ఇలాంటి సోది మాటలు మాత్రం చెప్పకండి ప్లీజ్.. చెప్పానుగా ఏ సినిమా అయినా ఏ రేంజ్ లో హిట్ అవ్వాలో ఆ రేంజ్ లోనే హిట్ అయి తీరుతుంది..
నాలుగు భాషలు నాలు గు రూపాయలు తెచ్చిపెడతాయేమో కానీ సినిమా ఫేట్ ను మార్చవు. సినిమా ఫేట్ ను మార్చేది మేకింగ్ అండ్ టేకింగ్..ఇవేవీ లేకుండా కేవలం హడావుడి చేస్తే మీ కథ ఎక్కడి నుంచి ఎత్తుకు వచ్చా రో, మీ పాట ఎక్కడి నుంచి ఎత్తుకువచ్చారో లేదా మీరు ఏ నవలను అనుమతి లేకుండానే కాపీ కొడుతున్నారో ఇలాంటివన్నీ ఫన్నీ ఫన్నీగా ట్రోల్ అవుతూనే ఉంటాయి. కనుక ప్యాన్ ఇండియా కల మంచిది అందుకు తగ్గ కథ ఉంటే ఇంకా మంచిది. ఆర్ ఆర్ ఆర్ ఆ పని చేసిందా? లేదా ? తెలియదు తెలిశాకే మీరే ఆనందించడమో లేదా ఓ నవ్వు నవ్వుకోవడమో తప్పక చేస్తారు. ఓటీటీలు వచ్చాక స్టార్ అన్న పదం ఉండదు అని ఎంత మొ త్తుకుంటున్నా ఇంకా మన స్టార్లు ఆ ఇమేజ్ లూ బూజులూ వదులుకోకపోవడంతో ఇప్పుడు కథలన్నీ తప్పక హీరోల చుట్టూ తిరుగుతాయి. అవి నాలుగు భాషల్లో అనువదితం అయి మనల్ని నవ్వుల పాల్జేస్తాయి.. స్టోరీ సెంట్రిక్ ఫిల్మ్ ను ఎవ్వరు తీసినా సంతోషించాలి.. హీరో సెంట్రిక్ ఫిల్మ్ ఎవ్వరు తీసినా నవ్వుకోవాలి.. మంచి కథకు హీరో ఒక సపోర్ట్ అంతే! కానీ ఆయనే అంతా కాదు కాబోడు కూడా!కనుక ప్యాన్ ఇండియా అన్నది ఓ జోక్ అని అందుకే అంటున్నా...