ఇప్పటి నుంచే కర్చీఫ్ వేసేస్తున్నారు..!

NAGARJUNA NAKKA
తెలుగు ఇండస్ట్రీ 2022మీద చాలా హోప్స్ పెట్టుకుంది. కోళ్ల పందేలకు పందెం రాయుళ్లు ఎలా సిద్ధమవుతున్నారో.. అలాగే టాలీవుడ్ కూడా సంక్రాంతికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ఆ పండుగకు సినిమాలను సిద్ధం చేస్తున్నారు. ప్రేక్షకులను థియేటర్ల బాట పట్టించేందుకు సిద్ధమవుతున్నారు. యాక్షన్, కామెడీ ఎంటర్ టైనర్లతో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేయబోతున్నారు.  
స్టార్ హీరోలు షూటింగ్స్‌లో వేగం పెంచేశారు. విడుదల తేదీలు కూడా ఖరారు చేస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్, రానా సినిమాలను సంక్రాంతికి విడుదల చేసేందుకు తేదీలను కూడా ప్రకటించేశారు నిర్మాతలు. సాగర్.కె.చంద్ర డైరెక్షన్ లో మళయాళీ హిట్ 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్‌గా తెరకెక్కుతోంది.
సూపర్ స్టార్ మహేశ్ బాబు 'సర్కారు వారి పాట' షూటింగ్‌కి అడ్డంకులు ఎదురైనా.. మహేశ్ బాబు మాత్రం పాత ప్లాన్‌నే అమల్లో పెట్టాలని ఫిక్స్ అయ్యాడు. ఈ సినిమాని సంక్రాంతికే విడుదల చేస్తాడట మహేశ్ బాబు. సెకండ్‌ వేవ్‌కి ముందు నుంచే 'సర్కారు వారి పాట' సంక్రాంతికి వస్తుందనే టాక్ వచ్చింది. అయితే మధ్యలో బ్రేకులు పడినా మహేశ్‌ మాత్రం కొంచెం స్పీడ్‌గా షూటింగ్‌ పూర్తి చేసి 'సర్కారు'ని సంక్రాంతికే విడుదల చేయాలని ఫిక్స్ అయిపోయాడు.
ఇక యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చాలా కాలం తర్వాత రొమాంటిక్ జానర్‌లో చేస్తోన్న సినిమా 'రాధేశ్యామ్'. వింటేజ్‌ లవ్‌స్టోరీగా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్‌కి కరోనాతో చాలాసార్లు బ్రేకులు పడ్డాయి. రీసెంట్‌గానే ఈ మూవీ షూటింగ్‌ పూర్తయ్యింది. ఇక పోస్ట్‌ప్రొడక్షన్‌లో ఉన్న ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేస్తున్నాడు చేస్తున్నాడు ప్రభాస్.
ఇక కళ్యాణ్‌ కృష్ణ 'నేల టిక్కెట్టు' టైమ్‌ నుంచి నాగార్జున కోసం వెయిట్ చేస్తున్నాడు. 'సోగ్గాడే చిన్ని నాయనా' సీక్వెల్  'బంగార్రాజు'ని పట్టాలెక్కించాలని చాలా ట్రై చేస్తున్నాడు. అయితే నాగ్‌ వేరే ప్రాజెక్ట్స్‌తో బిజీ అయి, ఈ సినిమాని పోస్ట్‌ పోన్ చేస్తున్నాడు. చాలా రోజులుగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రపోజల్‌ని అగస్ట్‌ ఎండింగ్‌ కల్లా పట్టాలెక్కిస్తారని సమాచారం.
ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్, మెగా హీరో వరుణ్‌ తేజ్‌ హీరోలుగా నటిస్తోన్న సినిమా 'ఎఫ్-3'. కరోనా లాక్‌డౌన్‌తో ఈ మూవీ షూటింగ్‌కి బ్రేకులు పడ్డాయి. ఇక సెకండ్‌ వేవ్‌ ఉధృతి కొంచెం తగ్గాక మళ్లీ షూటింగ్‌కి వెళ్లింది 'ఎఫ్-3'. ఈ సినిమాని కూడా సంక్రాంతికి విడుదల చేస్తారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: