కొనసాగుతున్న ఆచార్య కన్ఫ్యూజన్ అలెర్ట్ అయిన పవన్ నిర్మాతలు !

Seetha Sailaja
మెగా స్టార్ చిరంజీవి కొరటాల శివ ల కాంబినేషన్ లో మొదలైన ‘ఆచార్య’ మూవీ విడుదలకు ఎదురౌతున్న అడ్డంకులు ఇప్పట్లో తొలిగేలా కనిపించడంలేదు. ఈమూవీ ఎప్పుడు విడుదల అవుతుందో కనీసం కొరటాలకు కూడ క్లారిటీ వచ్చినట్లు అనిపించడంలేదు. కొరటాల శివ పేరు సినిమా తెరమీద చూసి మూడేళ్లు అయిపోయింది. ఇంకా ఎంతకాలం పడుతుందో అన్నవిషయం  పై శివ ఎన్నిప్రయత్నాలు చేసినా క్లారిటీ లేకుండా పోయింది.  


వాస్తవానికి ఈమూవీ షూటింగ్ పూర్తి అయినప్పటికీ ఈమూవీని విడుదల చేయడానికి సరైన  రిలీజ్ డేట్ దొరకడంలేదు అంటున్నారు. అక్టోబర్ 13న ‘ఆర్ ఆర్ ఆర్’ వస్తోంది.  వాస్తవానికి ఆడేట్ కు ఆ మూవీ వస్తుందా రాదా అన్న కన్ఫ్యూజన్ చివరివరకు కొనసాగుతూనే ఉంటుంది. దీనికితోడు కరోనా థర్డ్ వేవ్ కేసులు రోజురోజుకి పెరిగిపోతు ఉండటంతో అసలు అక్టోబర్ నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయి అన్నది ఎవరికి క్లారిటీ లేదు.  


అనుకున్న సమయానికి ‘ఆర్ ఆర్ ఆర్’ రాకపోతే ఆ డేట్ కు రావాలని ‘ఆచార్య’ యూనిట్ ఆ డేట్ పై ఆశ పెట్టుకుంది. అయితే కరోనా పరిస్థితులు మరింత దిగజారిపోతే ఎవరు ఏమిచేయలేని పరిస్థితి. ఇప్పటికే సంక్రాంతి విడుదల అవుతున్న భారీ సినిమాలు అన్ని తమ రిలీజ్ డేట్స్ ప్రకటించాయి.  దీనితో కరోనా థర్డ్ వేవ్ కారణం చెప్పి ‘ఆర్ ఆర్ ఆర్’ సంక్రాంతి రేస్ కు రావాలని ప్రయత్నిస్తే ఆ ఆలోచనలను ఈసారి గట్టిగా అడ్డుకోవాలని అవసరం అనుకుంటే ప్రొడ్యూసర్స్ గిల్డ్  దగ్గర పంచాయితీ పెట్టాలని ఇప్పటికే సంక్రాంతికి రిలీజ్ కు రెడీ అయిన నిర్మాతలు ఆలోచనలు జరుపుతున్నట్లు టాక్.




దీనితో కొరటాల శివ తెలివిగా జనవరి 12న విడుదల అని ప్రకటించే ఆలోచన చేసినట్లుగా వస్తున్న వార్తలు బయటకు లీక్ అవ్వడంతో పవన్ కళ్యాణ్ ‘అయ్యప్పన్ కోషియం’ రీమేక్ విడుదల జనవరి 12న అని ప్రకటించారు. దీనితో ‘ఆచార్య’ కు అటు దసరా ఇటు సంక్రాంతికి సంబంధించిన రెండు పండుగ సీజన్ లు మిస్ కావడంతో ఏ డేట్ కు ఈమూవీని తీసుకు రావాలో తెలియని అయోమయ స్థితిలో ‘ఆచార్య’ యూనిట్ ఉన్నట్లు టాక్..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: