రోజా సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆ ఇద్ద‌రు హీరోల‌కు ఓకే చెప్పేసిందిగా ?

VUYYURU SUBHASH
రోజా.. ప్రముఖ సీనియర్ నటి.. అంతేకాదు నగరి ఎమ్మెల్యే కూడా.. మన తెలుగు రాష్ట్రాలలో రోజా పేరు వినని వారంటూ ఎవరూ ఉండరు.. ఈమె ప్రతిరోజు..ప్రతి సారి.. ఏదో ఒక వార్తతో సోషల్ మీడియాలో తన క్రియేటివిటీని చాటుకుంటూ ఉంటుంది. హీరోయిన్ గా సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టి స్టార్ హీరోయిన్ గా,  ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రోజా,  ఇటీవల జబర్దస్త్ కామెడీ షో కి జడ్జిగా వ్యవహరిస్తోంది. ఈ షో లో  కమెడియన్ల కంటే ముందుగానే ఈమె  డైలాగులు చెప్పేసి, అందరిని ఆకట్టుకుంటూ కడుపుబ్బా నవ్విస్తూ ఉంటుంది.
ఈ షో కి ఈమె అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు కూడా సమాచారం. ఇక ఈమె తెలుగు, తమిళ్ పరిశ్రమలో బాగా నటించి, తన అద్భుతమైన నటన తో ఎంతో మందిని ఆకట్టుకుంది. రోజా ప్రస్తుతం సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉందని చెప్పవచ్చు. వన్నె చెదరని అందంతో ఇప్పటికి కుర్రకారును ఆకట్టుకున్న రోజా సినిమా అవకాశాలు వస్తున్నప్పటికీ కొన్ని కారణాల చేత దూరంగా ఉంటూ వస్తోంది. ఒకప్పుడు ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన రోజా,  ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో కి వస్తే , హీరో కి తల్లిగా లేదా హీరోయిన్ కి తల్లిగా నటిస్తానని  చెప్పింది.
ఇకపోతే ఆమెకు మంచి పాత్ర దొరికితే నటించడానికి ఏమాత్రం వెనుకాడనని కూడా చెప్పినట్లు సమాచారం.   ఇండస్ట్రీ లోకి వస్తే, ఎవరితో నటిస్తారు అని ఒక నెటిజన్  అడగగా , ఆమె అందుకు సమాధానంగా.. తన మిత్రులు అలాగే తోటి నటులైన చిరంజీవి, నాగార్జున తో మాత్రమే నటిస్తానని, ఒకవేళ వీరితో  నటించే అవకాశం వస్తే, వదిలేసే ప్రసక్తే లేదని కూడా చెబుతోంది.  త్వరలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి, మరొకసారి తనేంటో ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: