ఎన్టీఆర్ చేసిన ఈ ప‌ని తెలిస్తే ఫ్యాన్స్‌కు పిచ్చ కోపం రాక మాన‌దు ?

VUYYURU SUBHASH
గుణశేఖర్ దర్శకత్వంలో ఎమ్మెస్ రెడ్డి నిర్మాణంలో వచ్చిన బాలరామాయణం సినిమాతో వెండితెరకు పరిచయం అయిన జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరో గా ఉన్నారు. నూనుగు మీసాల‌ వయసులోనే ఎన్టీఆర్ ఆది - సింహాద్రి - స్టూడెంట్ నెంబర్ వన్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్లతో తిరుగులేని మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ కు కొన్ని ప్లాప్‌ సినిమాలు వచ్చినా టెంపర్ సినిమా నుంచి ఎన్టీఆర్ పుంజుకున్నాడు. టెంపర్ - నాన్నకు ప్రేమతో - జనతా గ్యారేజ్ -  జై లవకుశ - అరవింద సమేత వీర రాఘవ లాంటి హిట్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మధ్యలో వరుస ప్లాపులతో ఎన్టీఆర్ కెరీర్ కాస్త డల్ అయింది.
అయితే ఆ సమయంలో కొన్ని కథలు తాను చేసే అవకాశం ఉన్నా ఎన్టీఆర్ వాటిని వదులుకున్నాడు. అయితే అవి బ్లాక్ బ‌స్టర్ హిట్లు అయ్యాయి. ఆ సినిమాల‌లో కూడా ఎన్టీఆర్ చేసి ఉంటే ఎన్టీఆర్ కెరీర్ మ‌రో రేంజ్‌లో ఉండేది. వినాయక్ - నితిన్ కాంబినేషన్ లో వచ్చిన దిల్ సినిమాను ముందుగా ఎన్టీఆర్‌తో చేయాల‌ని వినాయ‌క్ అనుకున్నాడు. ఇక సుకుమార్ - అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన ఆర్య సినిమా లో నటించే అవకాశం ముందుగా ఎన్టీఆర్‌కే వచ్చింది. ఇక సురేందర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అయిన అతనొక్కడే సినిమా కథను ముందు ఎన్టీఆర్ కి చెప్పగా ఎన్టీఆర్ చేయన‌న‌డంతో తర్వాత కళ్యాణ్ రామ్ చేసి సూపర్ హిట్ అందుకున్నాడు.
భద్ర సినిమాను బోయపాటి శ్రీను ముందుగా ఎన్టీఆర్ తోనే చేయాలనుకున్నాడు. వినాయక కృష్ణ సినిమా ను సైతం ముందుగా ఎన్టీఆర్ తో చేయాలనుకున్నా.. ఎన్టీఆర్ రిజెక్ట్ చేయడంతో రవితేజతో తీసి హిట్ కొట్టాడు. అలాగే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అల్లు అర్జున్ - చెర్రీ కాంబినేష‌న్లో లో వచ్చిన ఎవడు, మహేష్ బాబు - కొరటాల కాంబినేషన్ లో వచ్చిన శ్రీమంతుడు సినిమా కథలు ముందుగా ఎన్టీఆర్ కి వచ్చాయి. అయితే ఎన్టీఆర్ వీటిని రిజెక్ట్‌ చేయడంతో బ్లాక్ బ‌స్టర్ హిట్లు మిస్ అయినట్లు అయింది. మ‌రి ఇన్ని సినిమాలు మిస్ అయినందుకు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్ మీద ఖ‌చ్చితంగా కోపం రాకుండా ?  ఎలా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: