ప్రస్తుతం బుల్లితెర స్టార్ యాంకర్లందరూ సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తున్నారు. ఇంట్లోనే ఉంటూ రకరకాల వీడియోలను తీసి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. చిన్న చిన్న వీడియోలను షూట్ చేసి తమ అభిమానులను ఎంటర్టైన్ చేస్తున్నారు. బుల్లితెర యాంకర్లు ప్రస్తుతం సోషల్ మీడియాను చాలా ఉపయోగించుకుంటున్నారు. సోషల్ మీడియాను వారు ఉపయోగించినంత ఎవరూ ఉపయోగించుకోవడం లేదన్నది నమ్మశక్యం కాని నిజం. సోషల్ మీడియా ద్వారా అభిమానులను పెంచుకోవడమే కాకుండా సినీ దర్శకులను కూడా ఆకట్టుకుంటున్నారు. దాంతో సినిమాల అవకాశాలను చేజిక్కించుకుంటున్నారు బుల్లి తెర యాంకర్లు. ఆ కోవలోకి చేరింది స్టార్ యాంకర్ వర్షిణీ.
తొందరగా అభిమానులకు దగ్గర కావలంటే సోషల్ మీడియానే వేదిక అనుకుందో ఏమో.. వరుసగా వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. అలా స్టార్ యాంకర్ వర్షిణి కూడా సోషల్ మీడియాను చాలా ఉపయోగించుకుంటోంది. ప్రస్తుతం ఆమె చేసిన ఒక వీడియో నెట్టింట్లో తెగ హంగామా చేస్తోంది. తీన్మార్ స్టెప్పులతో అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటోంది వర్షిణీ. దాంత సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్‌ని సంపాదించుకుంది ఈ గ్లామరస్ యాంకర్. తన హాట్ హాట్ ఫోటోలను, వీడియోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ అభిమానులను పెంచుకుంటోంది.
అయితే ఇటీవల ఈ బ్యూటీ… డ్రింక్స్ పక్కకు జరిపిన రొనాల్డో వీడియోను రిమిక్స్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ ఊపుతో మరో వీడియోతో నెట్టింట రచ్చ చేస్తోంది. ఓ పక్క వర్షం వస్తుంటే.. మరో పక్క తన ఇంటి కారిడార్‌లో తన ఫ్రెండ్ తో కలిసి తీన్ స్టెప్పులేసింది. ఆ వీడియో వర్షిణీ హాట్ హాట్ గా కనిపించింది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. ఈ వీడియో పై నెటిజన్లు ఆశ్ఛర్యకర కామెంట్లు పెడుతున్నారు.
Your browser does not support HTML5 video.