బ్రతికుండగానే చనిపోయానన్న శోభన్‌బాబు.... కారణం ?
ఇష్టంతోనే ఆయన ప్రతి రోజు తప్పకుండా ఏదో ఒక సినిమాలు చూసేవారట అందులో ముఖ్యంగా సీనియర్ స్టార్ హీరో లు అనటువంటి ఎన్టీఆర్, ఏఎన్నార్ సినిమాలు అంటే చాలా పిచ్చి అని ఆయన ఒకానొక సందర్భంలో తెలిపాడు. ఇక విజయవాడలో శోభన్ బాబు డిగ్రీ చదువుకునేటప్పుడు పునర్జన్మ అనే ఒక నాటకంలో కూడా నటించాడు. ఇక ఆ తర్వాత వచ్చిన మల్లేశ్వరి అనే సినిమా కథ బాగా నచ్చడంతో ఏకంగా ఇరవై రెండు సార్లు చూసినట్టు సమాచారం.
ఇక ఎలాగైనా సరే సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని ఆలోచనతోనే, చెన్నైలో లా కోర్సు చదివేటప్పుడు ఉదయం అంతా కాలేజీకి వెళ్లడం , తిరిగి సాయంత్రం సినిమా ప్రయత్నాలు చేయడం వంటివి చేసేవాడు. వయసు ముదిరి పోతోంది అని తల్లిదండ్రులు హెచ్చరించడంతో, 1958 వ సంవత్సరంలో వివాహం చేసుకోవడం జరిగింది. ఇక వివాహం అనంతరం ఆయనకి 1959వ సంవత్సరంలో నందమూరి తారక రామారావు నటించిన దైవ బలం అనే సినిమాలో నటించడానికి అవకాశం వచ్చింది.
ఇక అక్కడ నటించి మంచి పేరు తెచ్చుకున్న ఈయన, ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి ఆంధ్ర సోగ్గాడు గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక కోదండరామి రెడ్డి కి శోభన్ బాబుకు మంచి స్నేహం ఉండేది. ఆ స్నేహం కారణంగానే, కోదండరామిరెడ్డి శోభన్ బాబు ను పిలిచి మరీ, అడిగారట.. ఎందుకు సినిమాలు చేయడం లేదు అని.. అందుకు శోభన్ బాబు .."ఆ అందాల సోగ్గాడు ఎప్పుడో చనిపోయాడు. ఇప్పుడు ముడతలు పడిన చర్మం జుట్టు ఊడిపోయి, ముసలి వయసు వచ్చేసింది. ఇప్పుడు నేను సినిమాలు చేస్తే, మేకప్ వేసి కవర్ చేశారు అని అభిమానులు అనుకుంటారు" అందుకే నేను సినిమాలు చేయను అని చెప్పాడు.