కోటి రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చినా వద్దన్న హీరోయిన్.. కారణం ?

Divya
సినీ ఇండస్ట్రీలో ఒకటీ, రెండు సినిమాలు సక్సెస్ అయ్యాయి అంటే, ఆ వెంటనే పారితోషకం పెంచుతారు మన హీరో హీరోయిన్లు. ఇక అంతే కాకుండా కథలో పాత్ర ను బట్టి పారితోషికాన్ని డిమాండ్ చేస్తూ ఉంటారు. అందులో తప్పేమి లేదు అనేది కొందరి అభిప్రాయం. అయితే మొదట రూ.25 లక్షల వరకు తీసుకున్న పారితోషికాన్ని తీసుకోని, ఆ తర్వాత అమాంతం కోటి రూపాయలకు డిమాండ్ చేస్తున్న హీరోయిన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక్కసారిగా సక్సెస్ అయిన వెంటనే దాదాపుగా కోటి రూపాయల వరకు పెంచేస్తున్నారు ఈమధ్య హీరోయిన్లు.. మన తెలుగు లో మంచి హిట్లు అందుకున్న"ఐశ్వర్య రాజేష్" ఏకంగా మూడో సినిమాకి కోటి రూపాయల వరకు అడుగుతున్నట్లు సమాచారం. ఈమె ఇంతలా పెంచడంతో తమిళ ఇండస్ట్రీ వారు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.

తెలుగు, తమిళ సినిమాలను కలుపుకొని , ఈమె చేతిలో దాదాపుగా పది సినిమాల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. అంత డిమాండ్ ఉన్న ఈమెకు రూ.10-25 లక్షలు తీసుకోవడం ఏమిటంటూ  కొంతమంది ఆమెకు తెలియజేశారట. దీంతో ఆమె క్రేజ్ ఉన్నప్పుడు బాగా సంపాదించుకోవాలని, ఒక్కసారిగా కోటి రూపాయల వరకు అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఈమె మొదట తమిళ ఇండస్ట్రీ నుంచి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత తెలుగులో కూడా నటించి , మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

ఇక అసలు విషయానికొస్తే.. ఐశ్వర్య రాజేష్ దగ్గరికి కొంతమంది నిర్మాతలు వచ్చి కోటి రూపాయల పారితోషికం ఇస్తాము.. తమ సినిమాలలో నటించాలని తెలుపగా.. ఆమె కథ నచ్చకపోవడంతో ఆ పారితోషికాన్ని తిరస్కరించింది. ఇక అంతే కాకుండా ఆమె నటనకు గుర్తింపు, తనకి బాగా క్రేజీ వస్తేనే, అంత రెమ్యునరేషన్ తీసుకున్నా, తప్పులేదని ఆమె అభిప్రాయం అట. అయితే ఇలాంటి  విషయంలో డబ్బులు తీసుకున్న తప్పులేదని సినీ ప్రేక్షకుల అభిప్రాయం. అందుకే ఇటీవల ప్రతి ఒక్కరూ కథను ఆచితూచి అడుగు వేస్తూ ఎంచుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: