తమన్నా మరో స్పెషల్ ఐటం సాంగ్ కు రెడీ.. ఈసారి మెగా హీరో..!

shami
మిల్కీ బ్యూటీ తమన్నా కేవలం హీరోయిన్ గానే కాదు స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తూ వస్తుంది. హీరో ఎవరైనా సరే స్పెషల్ సాంగ్ చేసేందుకు తాను రెడీ అంటుంది తమన్నా డిమాండ్ చేసినంత రెమ్యునరేషన్ ఇస్తే చాలు అమ్మడు ఐటం సాంగ్ కు సై అంటుంది. ఈ క్రమంలో తమన్నా లేటెస్ట్ గా మరో స్పెషల్ ఐటం సాంగ్ కు ఓకే చెప్పిందని టాక్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గని సినిమాలో అమ్మడు స్పెషల్ ఐటం సాంగ్ చేస్తుందని తెలుస్తుంది.
ఒకప్పుడు ఈ ఐటం సాంగ్స్ కోసం స్పెషల్ హీరోయిన్స్ ఉండే వారు కాని ఇప్పుడు స్టార్ హీరోయిన్స్ కూడా స్పెషల్ సాంగ్స్ మీద ఫోకస్ పెడుతున్నారు. స్టార్ హీరోయిన్స్ లో ముఖ్యంగా తమన్నా స్పెషల్ సాంగ్ అంటే చాలు సై అనేస్తుంది. వరుణ్ తేజ్ గని సినిమాలో తమన్నా సాంగ్ స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంటుందని తెలుస్తుంది. ఈ సాంగ్ చేసేందుకు అమ్మడు భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది.
తమన్నా చేస్తున్న ఈ సాంగ్ సినిమాకు చాలా ప్లస్ అవుతుందని అంటున్నారు. డ్యాన్స్ లో కూడా తమన్నా అదరగొట్టేస్తుంది కాబట్టి తమన్నా తన గ్రేస్ తో గనిలో అదరగొడుతుందని అంటున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గానే కాదు ఛాన్స్ వస్తే ఎలాంటి పాత్రలైనా చేస్తుంది. ఇక ఇప్పుడు మరోసారి స్పెషల్ సాంగ్ తో తన సత్తా చాటాలని చూస్తుంది. కిరణ్ కొర్రపాటి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో సయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమా మీద వరుణ్ తేజ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మెగా హీరోలకు లక్కీ హీరోయిన్ అయిన తమన్నా గని కోసం తన గ్లామర్ తో ఎట్రాక్ట్ చేయాలని చూస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: