సీరియల్స్ లో ఛాన్స్ కొట్టేసిన జబర్థస్త్ కమెడియన్..

Divya

ఈటీవీలో ప్రసారమవుతున్న ఎక్స్ ట్రా జబర్దస్త్ , జబర్దస్త్ కామెడీ షో లు ప్రేక్షకులకు అత్యంత వినోదాన్ని పంచడానికి పోటీపడుతున్నాయి. ఈ తరుణంలోనే ఎంతోమంది కమెడియన్లు గా జబర్దస్త్ షో లోకి అడుగు పెట్టి , ఆ తర్వాత టీం లీడర్ గా ఎదుగుతూ తమ ప్రతిభను చూపిస్తుంటే,  మరి కొంతమంది వెండితెరపై అడుగులు వేస్తున్నారు.ఇక  మరి కొంతమంది సీరియల్స్ లోకి వస్తున్నారు. ఇకపోతే మల్లెమాల ప్రొడక్షన్స్ రూల్స్ ప్రకారం.. ఒకసారి జబర్దస్త్ వదిలేస్తే, మరోసారి వచ్చే అవకాశం లేదు. మరొక రూల్ ఏమంటే ,చేస్తే కేవలం జబర్దస్త్ షో లో మాత్రమే చేయాలి.. లేదంటే చేయకూడదు అనే నిబంధనలు పెట్టింది.

అయితే ఇటీవల సీజన్ 4  బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా, పాటిస్పేట్ చేయడానికి ముక్కు అవినాష్ కు అవకాశం వచ్చినప్పుడు, ఆయన జబర్దస్త్ షో ని వదిలేశాడు. అయితే ఇప్పుడు మళ్లీ ఎంట్రీ లేదనే విషయం తెలుసు కాబట్టి ,తర్వాత జబర్దస్త్ లోకి ప్రవేశించను అని కూడా చెప్పాడు. ఇకపోతే బిగ్ బాస్  ద్వారా దాదాపుగా 30 లక్షల ను సంపాదించాడు అవినాష్. ఇక ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్  షో లో పాటిస్పేట్ చేస్తున్నాడు. ఇక చంద్ర కూడా జబర్దస్త్ షో నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఇతను  కూడా అక్కడే అరియానా తో కలసి కామెడీ చేస్తూ షోలో దూసుకుపోతున్నారు.

అయితే చమ్మక్ చంద్ర మరే దారి చూసుకోలేదు.. కానీ ముక్కు అవినాష్ మాత్రం సీరియల్స్ లోకి ప్రవేశించాడు. ఇకపోతే కామెడీ స్టార్స్ టిఆర్పి రేటింగ్ మాత్రం పెద్దగా సాధించడం లేదు. ఇక దర్శక నిర్మాతలు మాత్రం ఏం చేసినా సరే కామెడీ స్టార్ రేటింగ్ తీసుకురావాలని చెబుతున్నారు. ఇక ఈ బాధ భరించలేక , స్టార్ మా లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ లో ఎంట్రీ ఇచ్చాడు అవినాష్. అయితే కేవలం అతిధి పాత్రలో నటించడానికి సీరియల్ లోకి ఎంట్రీ ఇచ్చాడా..? లేదా కంటిన్యూ చేస్తాడా..? అనే విషయం ఇంకా తేలాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: