ద‌యచేసి వినండి : జై భీమ్ అనండి...

RATNA KISHORE
ద‌యచేసి వినండి : జై భీమ్ అనండి...
బాల లాంటి డైరెక్ట‌ర్లు
జ్ఞాన్ వేల్ లాంటి డైరెక్ట‌ర్లు
మ‌న ద‌గ్గ‌ర ఉన్నారు
కానీ మ‌నం వాడుకోం
ఇబ్బంది అక్క‌డే



మా నాయ‌న బాల‌య్య లాంటి న‌వ‌ల, లేదా మ‌రొక‌టో మ‌న‌కు అక్క‌ర్లేదు. ఎందుకంటే నాలుగు త‌రాల మాల మాదిగ‌ల క‌ష్టాలు అస్స‌లు మ‌నం వినం చూడం.. ఫార్మెట్ క‌థ‌ల వ‌ల‌లో ఉంటాం.,. ఆ వ‌ల‌లోనే చిక్కుకుపోయి సినిమాలు హిట్ కావ‌డం లేద‌ని గ‌గ్గోలు పెడ్తాం.. కానీ ఆ ప‌రిధి దాటితో మ‌న‌కూ ఎన్నో క‌థ‌లు రాజ్య హింస‌కు కార‌ణం అయిన క‌థ‌లు ప్ర‌జా జీవితాల‌ను మార్చిన కథ‌లు క‌న‌ప‌డ్తాయి .. మాకు గుడ్డి మేం చూడం అని అంటేం  ఏం చేయ‌లేం కానీ చూస్తే ఎన్నో గొప్ప క‌థ‌లు.. తెలుగు నేల‌పై సామాజిక మార్పు ను సినిమా కోరుకోవ‌డం లేదు.. క‌నుక ఇలాంటి సినిమాలు రావడం లేదు సూర్య లాంటి హీరోలూ రంజిత్ లాంటి ద‌ర్శ‌కులు కోరుకుంటున్నారు.. క‌నుక అక్క‌డ సాధ్యం.. సినిమా ఎలా అయినా హిట్టు కొట్టాల‌న్న త‌ప‌న‌లో అలా కొట్టుకుపోతున్నారు.. లేదా త‌మ‌లో తామే కొట్టుకు ఛ‌స్తున్నారు అని ఓ విమ‌ర్శ నెటిజ‌న్లు వినిపిస్తున్నారు.



న‌ల్ల కోటులో హీరో.. టైటిల్ జై భీమ్ .. త‌మ ఆరాధ్య దైవం అంబేద్క‌ర్ లా క‌నిపిస్తున్న హీరో సూర్య.. అభిమానుల‌కు కావాల్సింది ఇదే.. మ‌న హీరోల‌కు చేత‌గానిదీ ఇదే.. స‌ర్ ద‌య‌చేసి ఈ సినిమాను మీరెవ్వ‌రూ ముట్టుకోవ‌ద్దు అంటూ సెటైర్లు పేలుతున్నాయి.. అయితే ఈ సినిమా తెలుగుతో పాటూ మ‌రికొన్ని భాష‌ల్లో తెర‌కెక్కుతుండడంతో ఆ త‌ల‌నొప్పి లేదు.. మేం సినిమా కెల‌క‌లేదు అని చెప్పాడు అడ్డాల శ్రీ‌కాంత్ నార‌ప్ప విష‌యంలో.. అంతా న‌వ్వుకున్నారు. చూశాక క‌థ‌కు మ‌సి పూశాక.. కానీ ఈ క‌థ సూర్య చెప్పిస్తున్నాడు.. తెలుగులోనూ ఇత‌ర భాష‌ల్లోనూ అనువాదం అవుతుంది.. బాబా సాహెబ్ స్ఫూర్తి ని పంచుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: