సినిమా ఇండస్ట్రీ లో అవకాశం తెచ్చుకొని స్టార్ గా ఎదిగి పోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. దాని కోసం ఎన్ని పరిణామాలను. అయినా ఎదుర్కొని సినిమా ఇండస్ట్రీ లోకి వస్తారు వీరు. ఇప్పటివరకు చాలా మంది నటీనటులు సినిమా కోసం ఎన్నో కష్టాలు పడి అవకాశం రావడం కోసం నానా ఇబ్బందులు పడ్డారు. అంతకంటే ముందు సినిమా ఇండస్ట్రీలోకి ప్రవేశించాలంటే కూడా ఒక యుద్ధమే జరుగుతుంది వారిలో. ఇంట్లో నుంచి సినిమా ఇండస్ట్రీలో కి వెళ్తానంటే పంపించేవారు కాదు. కానీ వారితో గొడవ పడి, వారిని ఒప్పించి వచ్చిన వారు చాలా మంది.
ఆ విధంగా ఒక నాటి ఎన్టీఆర్ దగ్గర్నుంచి ఇప్పటి కొత్తవారి వరకు చాలా మంది సినిమా ఇండస్ట్రీలో రాణించాలని ఎన్నో ఆశలతో వస్తూ ఉంటారు. అలా సిల్క్ స్మిత ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. సిల్క్ స్మిత ఆత్మహత్య ఘటన ఇప్పటికీ ఆమె అభిమానులను శోకసంద్రంలో ముంచుతుంది. నటిగా ఆమె ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. 1996లో తన నివాసంలో బలవన్మరణం చేసుకుని ఆమె చనిపోగా ఇప్పటికీ జనాలు ఆమెను మరువలేదు.
సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి . ఏలూరు సమీపంలోనీ గ్రామంలో పుట్టి పెరిగిన స్మిత సినిమా ఇండస్ట్రీ లో నటిస్తే బాగా డబ్బు సంపాదించవచ్చు అని విని తాను సినిమాల్లోకి వెళతానని తన పెంపుడు తల్లి దగ్గర వ్యక్తం చేసింది. దాంతో ఈజీ గా తన పని అయినట్లు ఆమె అనుకుంది. పెంపుడు తల్లి అన్నపూర్ణమ్మ తో కలిసి ఎవరికీ చెప్పకుండా మద్రాసుకు వెళ్లారు. జూనియర్ ఆర్టిస్టులా కొన్ని సినిమాలు చేసింది సిల్క్ స్మిత. అయితే తమిళ దర్శకుడు విను చక్రవర్తి ఆమె రూపం కు ముగ్ధుడై భవిష్యత్తులో మంచి పేరు తెచ్చుకుని స్టార్ అవుతుందని ఊహించి ఆమెకు నటనలో మెళకువలు నేర్పారు. ఆయన సహాయంతో మలయాళం సినిమా ద్వారా ఆకట్టుకొని తన అందచందాలతో ప్రేక్షకులను మెప్పించి పలు అవకాశాలు అందుకుని ఆ తర్వాత టాప్ స్టార్‌గా ఎదిగింది.