ఏపీ, తెలంగాణ‌లో సూప‌ర్‌ థియేట‌ర్లు ... ఇక 50 సీట్లే...!

VUYYURU SUBHASH
క‌రోనా దెబ్బ‌తో ప్ర‌పంచంలోనే అన్ని వ్య‌వ‌స్థ‌లు స‌ర్వ నాశ‌నం అయ్యాయి. ఈ క్ర‌మంలోనే సినిమా వ్య‌వ‌స్థ కూడా ఎలా కుప్ప కూలిందో మ‌నం చూస్తూనే ఉన్నాం. ఇప్ప‌టికే క‌రోనా ఫస్ట్ వేవ్ దెబ్బ‌తోనే సినిమా రంగం పూర్తిగా కుదేలు అయ్యింది. ఇప్ప‌టికే తెలుగు లో ప‌లు పెద్ద పెద్ద సినిమాలు కూడా షూటింగ్ ఆగిపోయాయి. క‌రోనా ఫ‌స్ట్ వేవ్ ముగిశాఖ ఎట్ట‌కేల‌కు ఈ సమ్మ‌ర్‌లో థియేట‌ర్ల‌ను తిరిగి ఓపెన్ చేశారు. వ‌కీల్ సాబ్ లాంటి పెద్ద సినిమా రిలీజ్ అయ్యింది. ఆ సినిమాకు సూప‌ర్ హిట్ టాక్ వ‌చ్చినా మునుప‌టి ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు అయితే రాలేద‌నే చెప్పాలి. అందుకే ఆ ఎఫెక్ట్ వ‌కీల్ సాబ్ వ‌సూళ్ల మీద కూడా ప‌డ్డాయి.
ఇక ఇప్పుడు సెకండ్ వేవ్ విజృంభ‌ణ తో మ‌ళ్లీ థియేట‌ర్ల‌ను మూసేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ త్వ‌ర‌లోనే థియేట‌ర్లు తిరిగి ఓపెన్ అయినా మునుప‌టి లా ప్రేక్ష‌కులు అయితే ఖ‌చ్చితంగా రార‌నే అంటున్నారు.  ఈ క్ర‌మంలోనే ఇక‌పై థియ‌ట‌ర్ల స్వ‌రూపం మారిపోతోంద‌ని అంటున్నారు ప్ర‌ముఖ నిర్మాత సురేష్ బాబు. ఆయ‌న సోద‌రుడు వెంక‌టేష్ హీరోగా న‌టించిన రీమేక్ మూవీ నార‌ప్ప ఓటీటీలో రిలీజ్ అవుతోంది. దీనిపై ఆయ‌న మాట్లాడుతూ ఇక‌పై రెగ్యుల‌ర్ థియేట‌ర్ల‌లోకి వెళ్లి సినిమా చూసే ఛాన్సులు త‌గ్గిపోతాయ‌ని ఆయ‌న అంటున్నారు.
ఇక‌పై సూప‌ర్ స్క్రీన్స్ థియేట‌ర్లు అందుబాటులోకి వ‌స్తాయ‌ని ఆయ చెపుతున్నారు. ఈ సూప‌ర్ స్క్రీన్ థియేట‌ర్లు కేవ‌లం 50 సీటింగ్ కెపాసిటీతో ఉంటాయ‌ని ఆయ‌న చెపుతున్నారు. ఇప్ప‌టికే బ‌స్టాండ్ ల‌లో థియేట‌ర్లు వ‌చ్చేశాయి. ఇప్పుడు పెద్ద పెద్ద క్లబ్ హౌస్ లలోనూ .. గ్రూప్ హౌస్ లలో కూడా ఈ 50 సిట్టింగ్ కెపాసిటీ ఉన్న థియేట‌ర్లు వ‌చ్చేస్తాయ‌ని ఆయ‌న చెపుతున్నారు. ఇక త్వ‌ర‌లోనే బ్యాంకుల్లో కూడా థియేట‌ర్లు ఓపెన్ చేసే కార్య‌క్ర‌మం అమ‌లు లోకి వ‌స్తుంద‌ని కూడా సురేష్ బాబు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: