పవన్‌కు మహేష్ నుంచి ఊహించని షాక్.... మైండ్ బ్లాక్ ?
అయితే అందరిలోనూ టెన్షన్ నెలకొంది. ఇప్పటి వరకు పవన్ సినిమాకు బుల్లి తెరపై రికార్డు స్థాయి టీఆర్పీ రేటింగ్ వచ్చిన దాఖలాలు లేవు. గతంలో పవన్ నటించిన గబ్బర్ సింగ్ - అత్తారింటికి దారేది సినిమాలు బుల్లి తెరపై మంచి టీ ఆర్పీలు సాధించినా.... తర్వాత అవి బ్రేక్ అయిపోయాయి. ఇక ఇప్పుడు వకీల్ సాబ్ అయినా బుల్లి తెరపై పవన్‌కు తిరుగులేని రికార్డు టీఆర్పీ రాబడుతుందని పవన్ ఫ్యాన్స్ ఆశిస్తోన్న టైంలో మరో షాక్ తగిలింది.
ఇదే రోజు మహేష్ బాబు నటించిన బ్లాక్ బస్టర్ సరిలేరు నీకెవ్వరు సినిమా జెమినిలో ప్రసారం కానుంది. ఈ సినిమా ఇప్పటికే బుల్లి తెరపై టెలీ కాస్ట్ అయిన ప్పుడు అదిరిపోయే టీఆర్పీ రేటింగ్ రాబట్టు కుంది. పైగా ఈ సినిమా గతేడాది సంక్రాంతికి వచ్చి సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఏదేమైనా వకీల్ సాబ్ ఫస్ట్ టైం బుల్లి తెరపై టెలీ కాస్ట్ అవుతున్నా గట్టి పోటీ అయితే తప్పేలా లేదు. మరి వకీల్ సాబ్ ఫస్ట్ బుల్లి తెరపై ఎంత టీఆర్పీ రాబడుతుందో ? అని పవన్ అభిమాను లు ఎంతో ఆసక్తి తో వెయిట్ చేస్తున్నారు.